Breaking News

మీ వాహనానికి హై సెక్యూరిటీ నంబర్‌ ప్లేట్‌ లేదా?

Published on Sat, 11/23/2024 - 08:02

సాక్షి, సిటీబ్యూరో: మీ వాహనానికి హై సెక్యూరిటీ నంబర్‌ ప్లేట్‌ లేదా? అయితే రవాణా శాఖ లెక్కల్లో అది లేనట్టే. అలాంటి వాహనాన్ని అమ్మాలన్నా, కొనాలన్నా కష్టమే. అంతేకాదు.. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ చేయడం కూడా సాధ్యం కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే  హై సెక్యూరిటీ నంబర్‌ ప్లేట్‌ (హెచ్‌ఎస్‌ఆర్‌పీ) లేని వాహనాలకు  రవాణా శాఖ ఆమోదం లేనట్లుగానే భావించాలి. వాటిపై ఆర్టీఏ నుంచి ఎలాంటి పౌరసేవలు  లభించవు. 

ఇంత కీలకమైన హై సెక్యూరిటీ నంబర్‌ ప్లేట్‌ అమలుకు నోచుకోవడం లేదు. వాహనదారులు ఇష్టారాజ్యంగా తమకు నచి్చన నంబర్‌ ప్లేట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. కాగా.. ఇప్పటికైనా హెచ్‌ఎస్‌ఆర్‌పీని అమర్చుకోవాలని రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు. వాహనాల భద్రత, రహదారి భద్రత దృష్ట్యా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉమ్మడి రాష్ట్రంలోనే హెచ్‌ఎస్‌ఆర్‌పీ  అమల్లోకి వచి్చంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీని అమలు తీరు నత్తనడకను తలపిస్తోంది. లక్షలాది వాహనాలు హెచ్‌ఎస్‌ఆర్‌పీకి  దూరంగానే ఉన్నాయి.  

నాణ్యతపై నమ్మకం లేక..  
ఆరీ్టఏలో రిజిస్ట్రేషన్‌ అయ్యే ప్రతీ వాహనానికి ఒక కోడ్‌ను కేటాయిస్తూ హై సెక్యూరిటీ నంబర్‌ ప్లేట్‌లో హోలోగ్రామ్‌ను ఏర్పాటు చేస్తారు. దీనిలో నమోదైన కోడ్‌ ఆధారంగానే రవాణా శాఖ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. వాహనం ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేయాలన్నా, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చుకోవాలన్నా, పన్నులు, ఫీజులు చెల్లించాలన్నా ఈ కోడ్‌ ఆధారంగానే సాధ్యమవుతుంది. చాలామంది వాహనదారులు హై సెక్యూరిటీ నంబర్‌ ప్లేట్ల నాణ్యత నాసిరకంగా ఉందని, అమర్చిన కొద్దిరోజులకే ఇవి పాడవుతున్నాయని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అల్యూమినియం నంబర్‌ ప్లేట్‌పై నల్లటి రంగులో రాసే అంకెలు సైతం ఎక్కువ కాలం ఉండడం లేదు. ఒకటి రెండేళ్లలోనే చెదిరిపోతున్నాయి. దీంతో వాహనదారులు తమకు నచి్చన విధానంలో నంబర్‌ ప్లేట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు.   

ఈ నిర్లక్ష్యానికి బాధ్యులెవరు? 
⇒వాహనాల భద్రత దృష్ట్యా 2013లో అప్పటి ప్రభుత్వం హైసెక్యూరిటీ నంబర్‌ ప్లేట్లను అమల్లోకి తెచి్చంది. దీని అమలు బాధ్యతను అప్పట్లో  ఆర్టీసీకి అప్పగించారు. ఓ ప్రైవేట్‌ సంస్థ సహకారంతో ఆర్టీఏ కార్యాలయాల్లోనే  హెచ్‌ఎస్‌ఆర్‌పీ సెంటర్లను  ఏర్పాటు చేశారు. కానీ కొత్తగా రిజి్రస్టేషన్‌ అయ్యే వాహనాల డిమాండ్‌ మేరకు హెచ్‌ఎస్‌ఆర్‌పీ సరఫరాలో ఆ  సంస్థ  విఫలమైంది.  

⇒ ప్రతిరోజూ సుమారు 2,500 వాహనాలు కొత్తగా నమోదవుతుండగా రోజుకు కనీసం వెయ్యి వాహనాలకు కూడా నంబర్‌ప్లేట్లు అందడంలేదు. దీంతో వాహనదారులు రిజి్రస్టేషన్ల కోసం 3 నుంచి 6 నెలల వరకు పడిగాపులు కాయాల్సివస్తోంది. ఈ  క్రమంలో రవాణాశాఖ అధికారులు తయారీ సంస్థపై ఒత్తిడి పెంచడంతో పాటు నంబర్‌ ప్లేట్‌ ఉంటేనే బండి రిజి్రస్టేషన్‌ తప్పనిసరి చేశారు. అయినా పెద్దగా పురోగతి కనిపించడంలేదు. 

ఆర్టీఓ స్థాయిలోనే మార్పు 
హెచ్‌ఎస్‌ఆర్‌పీ లేకపోవడం వల్ల  నిలిచిపోయిన ట్రాన్సాక్షన్స్‌ను పునరుద్ధరించే సదుపాయం ఇప్పటి వరకు రవాణా కమిషనర్‌ కార్యాలయానికే పరిమితం కాగా.. ఇటీవల దీనిని  వికేంద్రీకరించారు. కిందిస్థాయిలో జిల్లా, ప్రాంతీయ రవాణా అధికారులు కూడా పునరుద్ధరించే సదుపాయం కలి్పంచారు. వాహనదారులు ఇందుకోసం హెచ్‌ఎస్‌ఆర్‌పీని ఏర్పాటు చేసుకొని  అధికారులను 
సంప్రదించవచ్చు.  

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)