Breaking News

మెట్‌పల్లిలో హనీ ట్రాప్ ముఠా గుట్టు రట్టు

Published on Wed, 12/31/2025 - 23:47

సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో గత కొంతకాలంగా విచ్చలవిడిగా సాగుతున్న హనీ ట్రాప్ దందాకు పోలీసులు బ్రేక్ వేశారు. ధనవంతులు, వ్యాపారులను టార్గెట్ చేసి ఉచ్చులో పడేసి నగ్న వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తున్న ముఠాను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం.. కోరుట్లకు చెందిన ప్రధాన సూత్రధారి రాజుకుమార్, స్వప్నతో పాటు కొందరు రౌడీ షీటర్ల సహకారంతో ఈ దందాను నిర్వహిస్తున్నాడు. పట్టణంలో ఉన్న ధనవంతులు, వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని, పరిచయాలు పెంచి వారిని ఓ ఇంటికి లేదా లాడ్జ్‌కు రప్పించి హనీ ట్రాప్‌లోకి దించేవారు. అనంతరం రహస్యంగా నగ్న వీడియోలు తీసేవారు. వాటిని బయటపెడతామంటూ బెదిరించి భారీగా డబ్బులు డిమాండ్ చేశారు.

ఇటీవల ఈ ముఠా మెట్‌పల్లికి చెందిన ఓ వ్యాపారిని లక్ష్యంగా చేసుకుని రూ.10 లక్షలు డిమాండ్ చేసింది. కాగా వీరి బెదిరింపులు తట్టుకోలేక బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. వ్యాపారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గుట్టుగా దర్యాప్తు చేపట్టారు. ముఠా కార్యకలాపాలపై నిఘా పెట్టారు. పోలీసుల దర్యాప్తులో కీలక ఆధారాలు లభించడంతో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టు అయిన వారి నుంచి మొబైల్ ఫోన్లు, వీడియో రికార్డులు సహా ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మరో ముగ్గురిని కూడా త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు. ఈ తరహా బ్లాక్‌మెయిల్ ఘటనలపై ప్రజలు భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. మెట్‌పల్లి పట్టణంలో కలకలం రేపిన ఈ హనీ ట్రాప్ కేసు, ఇలాంటి నేరాలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారనే సందేశాన్ని ఇచ్చిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)