ఖమ్మం జిల్లా కల్లూరులో ఎస్‌ఐ Vs హోంగార్డు..

Published on Sat, 09/09/2023 - 03:51

కల్లూరు: ఖమ్మం జిల్లా కల్లూరు మండలం అంబేడ్కర్‌నగర్‌కు చెందిన హోంగార్డు సిరసాని రాంబాబు(సస్పెన్షన్‌లో ఉన్నారు) తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా జిల్లా హోంగార్డుల వాట్సాప్‌ గ్రూప్‌లో శుక్రవారం మెసేజ్‌ పెట్టడం పోలీసు శాఖలో కలకలం సృష్టించింది. హైదరాబాద్‌లో హోంగార్డు రవీందర్‌ మృతి విషయం మరువకముందే.. ఈ మెసేజ్‌ పెట్టడం, విషయం ఆనో టా ఈనోటా బయటకు రావడంతో చర్చనీయాంశంగా మారింది. దీంతో సిరసాని రాంబాబుతో ‘సాక్షి’మాట్లాడగా, హోంగార్డులు పని భారంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, చాలీచాలని జీతంతో ఇబ్బందిపడుతున్నారని వాపోయాడు.

కల్లూరులో భూమి విషయంలో అంబేడ్కర్‌నగర్‌కు చెందిన కొందరు తన తల్లిదండ్రులపై ఫిబ్రవరి 10న దాడి చేస్తే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆ సమయాన వేరే ప్రాంతంలో ఉన్న తాను ఫిబ్రవరి 28న ఎస్‌ఐ పి.రఘుతో కేసు విషయమై మాట్లాడితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్ప డమేకాక ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేయించారని ఆరోపించాడు. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహ త్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. 

ఆరోపణల్లో వాస్తవం లేదు: ఎస్‌ఐ 
సస్పెండ్‌ అయిన హోంగార్డు సిరసాని రాంబాబు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని కల్లూరు ఎస్‌ఐ పి.రఘు స్పష్టం చేశారు. భూమి అక్రమంగా ఆయనే ఆక్రమించాడని, ఇతర ఫిర్యాదులు కూడా ఉన్నాయన్నారు. గతంలో తోటి హోంగార్డును కొట్టి సస్పెండ్‌ అయ్యి జైలుకు వెళ్లి రాగా, కొంత కాలానికి విధుల్లో తీసుకున్నట్లు తెలిపారు. అయినా ప్రవర్తనలో మార్పు రాకపోగా, మద్యం సేవించి విధులకు వస్తుండడంతో సస్పెండ్‌ చేశారని వెల్లడించారు. 

Videos

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)