Breaking News

బతికుండగానే శ్మశానవాటికకు..

Published on Sun, 06/15/2025 - 02:54

ధర్మపురి: జగిత్యాల జిల్లా ధర్మపురిలో మానవత్వం మంటగలిసింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి జీవచ్ఛవంలా మారగా అతడిని అద్దె ఇంట్లోకి రానీయలేదు ఆ ఇంటి యజమాని. దీంతో గత్యంతరం లేక కుటుంబ సభ్యులు అతడిని శ్మశానవాటి కకు తీసుకెళ్లారు. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ధర్మపురిలోని ఎస్సీ కాలనీకి చెందిన రంగు గోపినాథ్‌ (45) స్థానిక నందికూడలి వద్ద టిఫిన్‌ సెంటర్‌ నడుపుతున్నాడు. ఆయనకు ఇద్దరు చెల్లెళ్లు. పెద్ద చెల్లి సుజాత, ఆమె కుమారుడు అభిషేక్‌తో కలిసి ఏడాదికాలంగా ఎస్సీ కాలనీలోని ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నారు.

కొన్ని రోజుల క్రితం గోపి అనారోగ్యం బారిన పడ్డాడు. కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయగా.. మెదడులో రక్తం గడ్డ కట్టిందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో వారం క్రితం గోపి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కరీంనగర్‌లో చికిత్స చేయించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌ తీసుకెళ్లారు. అప్పు చేసి రూ.50 వేల వరకు ఖర్చు పెట్టినా అతడి పరిస్థితిలో మార్పు రాకపోవడంతో బతకడం కష్టమని, ఇంటికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో గోపిని తిరిగి ధర్మపురికి తీసుకొచ్చారు. అయితే జీవచ్ఛవంలా ఉన్న గోపిని ఇంట్లోకి తీసుకురావద్దంటూ ఇంటి యజమాని నిరాకరించాడు. దీంతో గత్యంతరం లేక కుటుంబ సభ్యులు కొన ఊపి రితో ఉన్న అతడిని ముందుగా శ్మశాన వాటిక వద్దకు తీసుకెళ్లారు. 

దయ చూపిన మున్నూరుకాపు సంఘం..
శ్మశాన వాటిక వద్ద పడుకోబెట్టిన గోపి పరిస్థితిని గమనించిన మున్నూరుకాపు సంఘం వారు సంఘం భవనంలో ఆశ్రయమి చ్చారు. గోపి దీనస్థితిని తెలుసుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ తక్షణ సాయం కింద రూ.10 వేలు, బీజేపీ నాయకుడు దామెర రాంసుధాకర్‌ రూ.10,500 ఆర్థిక సాయాన్ని అందించారు.
 

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)