హెచ్‌ఎండీఏ ఏపీఓ కృష్ణకుమార్‌ సస్పెన్షన్‌

Published on Thu, 03/21/2024 - 02:00

సాక్షి, హైదరాబాద్‌: ఎలాంటి పరిశీలన లేకుండానే టీడీఆర్‌ సర్టిఫికెట్‌ల జారీలో ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించిన శంకర్‌పల్లి జోన్‌ అసిస్టెంట్‌ ప్లానింగ్‌ అధికారి బీవీ.కృష్ణకుమార్‌ను హెచ్‌ఎండీఏ కమిషనర్‌ దానకిషోర్‌ బుధవారం సస్పెండ్‌ చేశారు. ఈ సస్పెన్షన్‌ వెంటనే అమల్లోకి వస్తున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు ఈ ఉదంతంపై సంబంధిత ప్లానింగ్‌ అధికారులకు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. నగరానికి పడమటి వైపున శంకర్‌పల్లి జోన్‌లో ఔటర్‌ రింగ్‌రోడ్డును ఆనుకొని ఉన్న పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు జరిగాయి.

అనేక చోట్ల నిబంధనలను విరుద్ధంగా కొనసాగిన ఈ నిర్మాణాల్లో కృష్ణకుమార్‌ ప్రమేయం ఉన్నట్టు మొదటి నుంచీ ఆరోపణలు ఉన్నాయి. హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణకు ఈయన ప్రధాన అనుచరుడిగా వ్యవహరించాడు. ఈ క్రమంలో కబ్జారాయుళ్లు, అక్రమ నిర్మాణాలకు పాల్పడే వారికి కృష్ణకుమార్‌ అనుకూలంగా వ్యవహరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. 

గండిపేట మండలం పుప్పాలగూడ గ్రామ పంచాయతీ పరిధిలో టీడీఆర్‌లపైన వచ్చిన దరఖా స్తులను పరిశీలించకుండానే ఉన్నతా«ధికారులను తప్పుదోవ పట్టించినట్టుగా తాజాగా రుజువు కావడంతో కమిషనర్‌ ఆయన్ను సస్పెండ్‌ చేశారు.  

 పుప్పాలగూడలోని 330 నుంచి 332 వరకు సర్వేనంబర్లలో తమకు ఉన్న 11,698 గజాల్లో 100 ఫీట్ల రోడ్డుకు  భూమిని గిఫ్ట్‌డీడ్‌ కింద గ్రా మపంచాయతీకి రిజిస్టర్‌ చేసినట్టు శ్రావణ్‌కుమా ర్‌తో పాటు, మరికొందరు తెలిపారు. ఈ మేరకు వారు టీడీఆర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. 

పుప్పాలగూడ గ్రామంలోనే వెంకటరమణ, మరికొందరు  314 నుంచి 317 వరకు సర్వేనంబర్లలో ఉన్న 22,046 గజాల్లో మాస్టర్‌ప్లా¯న్‌ కింద 100 ఫీట్‌ రోడ్డులో భూమి పోయిందంటూ టీడీఆర్‌కు దరఖాస్తు చేసుకున్నారు.

టీడీఆర్‌ దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించకుండానే కృష్ణకుమార్‌ తన పై అధికారులను తప్పుదోవ పట్టించారు. ప్రస్తుతం ఈ ఒకటిరెండు ఉదంతాలే బయటకు వచ్చినా, ఇంకా వెలుగులోకి రాని అక్రమాలు పెద్దఎత్తునే ఉంటాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అప్పట్లో శివబాలకృష్ణపై ఏసీబీ దాడులు కొనసాగుతున్న సమయంలోనే కృష్ణకుమార్‌ అమెరికాకు వెళ్లడం కూడా చర్చనీయాంశమైంది. ఆయన అమెరికాకు వెళ్లడంతో ఏసీబీ దాడుల నుంచి తప్పించుకున్నాడని అప్పట్లో హెచ్‌ఎండీఏ వర్గాలు చర్చించుకోవడం గమనార్హం.

Videos

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య కుట్ర

అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే

ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్

ఒక రోజుకు 80 లక్షలు... ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నారు..!

చైనా వేదికపై ఫేక్ మేయర్ ప్రచారం?

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)