Breaking News

‘మహా ప్రణాళిక’కు సాంకేతిక దన్ను

Published on Sun, 08/03/2025 - 12:16

హైదరాబాద్‌: మహా నగర  సమగ్ర ప్రణాళిక– 2050 రూపకల్పనకు ఐఐటీ హైదరాబాద్‌ సాంకేతిక భాగస్వామిగా సేవలందించనుంది. ఈ మేరకు హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ), ఐఐటీ హైదరాబాద్‌తో ఒప్పందం ఏర్పాటు చేసుకుంది. మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఐఐటీ సంస్థ అందజేయనుంది. భవిష్యత్‌ అవసరాలకనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాల మేరకు హైదరాబాద్‌ నగర విస్తరణ, అభివృద్ధి కోసం హెచ్‌ఎండీఏ  సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌ కోసం భారీ కసరత్తు చేపట్టిన విషయం విదితమే. 

ఇప్పటి వరకు ఉన్న ఐదు మాస్టర్‌ ప్లాన్‌లను విలీనం చేస్తూ ట్రిపుల్‌ ఆర్‌ వరకు ఒకే సమగ్రమైన  మహా ప్రణాళికను రూపొందించనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రజా రవాణా, మౌలిక సదుపాయాల కల్పన కోసం కాంప్రహెన్సివ్‌ మొబిలిటీ ప్లాన్, లాజిస్టిక్స్, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యంగా ఆర్థికాభివృద్ధి ప్రణాళిక, జల వనరులు, అడవులు, పర్యావరణ పరిరక్షణ కోసం బ్లూగ్రీన్‌ ప్లాన్‌లను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం  ఈ మూడు రకాల ప్రణాళికలు తుది దశకు చేరుకున్నాయి. వీటికి అనుగుణంగా సమగ్రమైన మాస్టర్‌ప్లాన్‌– 2050ను తయారు చేస్తారు. ఇందుకోసం  రెండు రకాల సాంకేతికతను జోడించనున్నారు. హైదరాబాద్‌ ఐఐటీ అభివృద్ధి చేసిన  త్రీడీ, టూడీ డిజిటల్‌ ట్విన్‌ టెక్నాలజీ ఆధారంగా బేస్‌ మ్యాపులను  సిద్ధం చేయనున్నారు. దీంతో హైదరాబాద్‌ మహానగర సమగ్ర స్వరూపం ఆవిష్కృతమవుతుందని హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు.  

ఔటర్‌ వరకు ఉన్నది ఉన్నట్లుగా... 
కొత్తగా రూపొందించనున్న మాస్టర్‌ప్లాన్‌– 2050లో ఔటర్‌ రింగ్‌రోడ్డు వరకు అంటే.. సుమారు 2050 చ.కి.మీ పరిధిలో త్రీడీ డిజిటల్‌ ట్విన్‌ టెక్నాలజీని వినియోగిస్తారు. దీనిద్వారా ప్రతి ప్రాంతం వెడల్పు, పొడవు, ఎత్తులను  పరిగణనలోకి తీసుకొని మూడు డైమెన్షన్‌లలో మ్యాపింగ్‌ చేస్తారు. ఇందుకోసం లైడార్‌ ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు. ఈ టెక్నాలజీతో ఔటర్‌ రింగ్‌రోడ్డు వరకు ఉన్న నగరంలోని ప్రతి అంగుళాన్ని రియల్‌ టైమ్‌లో ఉన్నది ఉన్నట్లుగా వీక్షించేందుకు అవకాశం లభిస్తుంది. వరదలు, ట్రాఫిక్‌ రద్దీ నియంత్రణ, మౌలిక సదుపాయాలు వంటి సేవలను  సత్వరమే  అందజేసే అవకాశం లభిస్తుంది.  హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ తదితర ప్రభుత్వ విభాగాల ప్లానింగ్‌లోనూ రియల్‌ టైమ్‌ టెక్నాలజీ వల్ల  వంద శాతం కచి్చతత్వాన్ని పాటించవచ్చు. ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ ఏరియాలో కూడా త్రీడీ డిజిటల్‌ ట్విన్‌ టెక్నాలజీని అమలు చేయనున్నట్లు అధికారులు  తెలిపారు.  

ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌ క్యాంపస్‌లోని స్మార్ట్‌ లివింగ్‌ ల్యాబ్‌ ఈ డిజిటల్‌ ట్విన్‌ టెక్నాలజీని  అభివృద్ధి చేసింది. దీనిద్వారా ఇనిస్టిట్యూట్‌ సమీపంలో రాకపోకలు సాగించే వాహనాల సంఖ్య, రద్దీని కచి్చతంగా అంచనా వేసి ట్రాఫిక్‌ నియంత్రణకు అవసరమైన సూచికలను  ఏర్పాటు చేశారు. నీటి వనరులను రియల్‌–టైమ్‌లో పర్యవేక్షించేందుకు, వృథాను నివారించేందుకు కూడా ఈ టెక్నాలజీ దోహదం చేసింది. గచ్చిబౌలిలోని ఒక రెసిడెన్షియల్‌ కాలనీలో ఈటెక్నాలజీ ద్వారా పైప్‌లైన్‌ల  లీకేజీలను గుర్తించి, నీటి సరఫరాను సమర్ధవంతంగా మెరుగుపరిచారు.అలాగే పార్కులు, పచ్చదనం పరిరక్షణలో త్రీడీ డిజిటల్‌ ట్విన్‌ మ్యాపింగ్‌  అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. ఈ టెక్నాలజీనే ఔటర్‌ వరకు విస్తరించనున్నారు. ముంబై, జైపూర్, వారణాసి, పుణె తదితర నగరాల మాస్టర్‌ప్లాన్‌ల రూపకల్పనలో త్రీడీ టెక్నాలజీని  వినియోగించినట్లు అధికారులు తెలిపారు.

ట్రిపుల్‌ ఆర్‌ వరకు టూడీ డిజిటల్‌.. 
హెచ్‌ఎండీఏలో కొత్తగా విలీనమైన ట్రిపుల్‌ ఆర్‌ వరకు అంటే సుమారు 11 వేల చదరపు కిలోమీటర్‌ల ప్రాంతాన్ని టూడీ డిజిటల్‌ టెక్నాలజీతో మ్యాపింగ్‌ చేస్తారు. ఇక్కడ రియల్‌ టైమ్‌ సమాచారం లభించదు. ట్రిపుల్‌ ఆర్‌ వరకు ఉన్న అన్ని ప్రాంతాల పొడవు, వెడల్పులను మ్యాపింగ్‌ చేస్తారు. ఆర్థిక అభివృద్ధి మండలాలను, నీటి వనరులు, అడవులు తదితర ప్రాంతాలను సమగ్రంగా మ్యాపింగ్‌ చేస్తారు. ట్రిపుల్‌ ఆర్‌ వరకు రవాణా సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు అవసరమైన రోడ్లు, బస్‌ర్యాపిడ్‌ సిస్టమ్, మెట్రో, ఎంఎంటీఎస్‌ తదితర ప్రజా రవాణా సదుపాయాలను ఈ ప్రణాళికలో పొందుపరుస్తారు. పార్కులు, పచ్చదనం విస్తరణకు ఈ ప్రణాళిక దోహదం చేయనుంది.  

త్వరలో టెండర్లు..
మాస్టర్‌ప్లాన్‌– 2050పై అధ్యయనం చేసి సమగ్ర నివేదికను అందజేసేందుకు త్వరలో కన్సల్టెన్సీని ఎంపిక చేయనున్నారు. ఆసక్తి గల సంస్థల నుంచి దరఖాస్తుల స్వీకరణకు త్వరలో ఆర్‌ఎఫ్‌పీ టెండర్‌ ప్రకటన విడుదల చేయనున్నారు. ఎంపికైన కన్సల్టెన్సీ అందజేసే నివేదిక ఆధారంగా మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించనున్నారు. ట్రిపుల్‌ ఆర్‌ వరకు సమగ్ర మాస్టర్‌ప్లాన్‌ అమల్లోకి రావడానికి ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం ఉంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)