Breaking News

రాజన్నతో ముడి.. హిజ్రాల సందడి

Published on Sun, 04/06/2025 - 07:55

వేములవాడ: రాజన్నను వరుడిగా భావించి వివాహమాడటం.. వేములవాడలో ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీ. ఏటా శ్రీరామనవమి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ కల్యాణోత్సవానికి సామాన్య భక్తులతోపాటు అధిక సంఖ్యలో హిజ్రాలు, జోగినులు హాజరవుతుంటారు. కానీ కల్యాణోత్సవానికి హాజరైన హిజ్రాలు, జోగినులు శివుడినే వరుడిగా భావించి వివాహమాడుతుంటారు. మంగళసూత్రం ధరించి, తలంబ్రాలు పోసుకుంటూ సంతోషంగా గడుపుతారు. రాష్ట్రంలో వేములవాడ రాజన్న సన్నిధిలో మాత్రమే శ్రీరామనవమి సందర్భంగా ఆవిష్కృతమయ్యే ఈ ఆచార, వ్యవహారాలపై ప్రత్యేక కథనమిది.   

నవమి రోజే ఏడడుగులు  
ఏటా శ్రీరామ నవమి రోజు జరిగే శ్రీసీతారాముల కల్యాణంలో శివపార్వతులు, జోగినులు, హిజ్రాలు పాల్గొంటారు. వీరంతా సంప్రదాయబద్ధంగా పట్టుచీరలు, ఆభరణాలు ధరించి అందంగా ముస్తాబై కల్యాణానికి హాజరవుతారు. తమను తాము.. రాజరాజేశ్వరస్వామికి భార్యలుగా భావించి.. వివాహ బంధంలోకి ప్రవేశిస్తారు. నెత్తిన జీలకర్ర బెల్లం, చేతిలో త్రిశూలం, మెడలో మంగళసూత్రం ధరించి పెళ్లి వేడుకలు జరుపుకోవడం విశేషం. ఆలయ ఆవరణలో జరిగే ఈ ప్రక్రియను.. ఆత్మవివాహం(స్వయంపరిత్యాగం)గా పరిగణిస్తుంటారు.   

వేడుక వెనుక భక్తి భావన  
ఈ వేడుక ద్వారా శివపార్వతులు, జోగినులు, హిజ్రా సమాజం భగవంతుని ఆశీస్సులను కోరుకుంటారు. హిజ్రాలను సమాజంలో ఒంటరిగా కాకుండా సమానంగా చూడాలనే ఆలోచన ఈ ఉత్సవానికి ప్రధాన సంకేతంగా నిలుస్తోందని భావిస్తుంటారు. వారి ఆత్మాభిమానం పెంచేందుకు, భగవంతుని కటాక్షానికి హిజ్రాలు కూడా పాత్రులనే భావనను చాటి చెప్పేలా ఈ ఉత్సవం సాగుతోంది. భక్తికి లింగ భేదం లేదని, దేవునికి ప్రతి ఒక్కరూ సమానమేనని ఈ వేడుకలు నిరూపిస్తున్నాయి. వారం రోజులపాటు వేములవాడలో వేడుకగా జరిగే ఈ తంతును చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు.   

సమాజంలో మార్పుకిది సంకేతం  
హిజ్రాలను అనాదిగా సమాజం అంగీకరించక, వారిని అటకెక్కించిన తీరు తెలిసిందే. కానీ వేములవాడ రాజన్న ఆలయంలో హిజ్రాలకు ప్రత్యేక గౌరవం కల్పించడం విశేషంగా భావిస్తారు. ఇక్కడ హిజ్రాలు దేవునితో ఆత్మీయబంధం కలిగి, ఆధ్యాత్మికంగా ప్రాధాన్యం పొందుతున్నారు. హిజ్రాలకు దేవతల మన్నింపు, ఆశీస్సులు లభిస్తున్నాయని భావించడంతో.. భక్తుల మధ్య వారికి గుర్తింపు పెరుగుతోంది. సామాజికంగా హిజ్రాలు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటారు. కానీ ఈ కల్యాణోత్సవం ద్వారా వారికి భక్తిపూర్వకమైన గుర్తింపు లభిస్తోంది. తాము సమాజంలో ఒంటరి కామని, గుర్తింపు ఉందని హిజ్రాలు స్వయంగా అర్థం చేసుకునేలా చేస్తుంది.  ఇటీవల హిజ్రాలకు ప్రభుత్వం కొన్ని హక్కులు, వసతులు కల్పించినా, సాధారణ ప్రజానీకంలో ఇప్పటికీ వారిపై వ్యతిరేక అభిప్రాయాలు ఉన్నాయి.   

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)