Breaking News

5,58,883 కేసుల పరిష్కారం

Published on Sun, 09/10/2023 - 04:52

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌కు విశేష స్పందన వచ్చింది. ఒక్క రోజే రికార్డు స్థాయిలో 5,58,883 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో కోర్టులో పెండింగ్‌ కేసులు 5,45,704 కాగా, ప్రీ లిటిగేషన్‌ కేసులు 13,179 ఉన్నాయి. మొత్తం రూ.180.10 కోట్ల పరిహారాన్ని అందించినట్లు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు.

రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ప్యాట్రన్‌ ఇన్‌ చీఫ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ జస్టిస్‌ పి.శ్యామ్‌ కోషి, హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ చైర్మన్‌ టి.వినోద్‌ కుమార్‌ సూచనలతో ఈ కార్యక్రమం విజయవంతమైందని చెప్పారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టులో జస్టిస్‌ శ్యామ్‌ కోషితో చెక్కులను కూడా అందజేసినట్లు తెలిపారు.

హైకోర్టులో 404 కేసులు..
హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ వినోద్‌ కుమార్‌ సూచనలతో నిర్వ­హించిన లోక్‌ అదాలత్‌లో హైకోర్టులోని 404 కేసులు పరిష్కారమయ్యాయి. అత్యదికంగా 204 మోటారు వాహనాల కేసులు, 71 కార్మికుల పరిహార వివాదానికి చెందినవి ఉన్నాయి. రూ.15 కోట్ల పరిహారాన్ని ప్రకటించారని, 1,100 మంది లబ్ధి పొందారని హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ కార్యదర్శి ఎం.శాంతివర్ధని తెలిపారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్‌ జి.వి.సీతాపతి, జస్టిస్‌ చల్లా కోదండరాం ఈ కేసులను పరిష్కరించారని వెల్లడించారు. 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)