Breaking News

క్రెడిట్‌ కార్డు బకాయి చెల్లించకపోతే ఉద్యోగంపై వేటు చెల్లదు

Published on Thu, 07/30/2026 - 08:11

సాక్షి, హైదరాబాద్‌: వ్యక్తిగత క్రెడిట్‌ కార్డు బకాయిని ఆలస్యంగా చెల్లించారనే కారణంగా ఉద్యోగిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం చట్టబద్ధం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగి, బ్యాంకు మధ్య క్రెడిట్‌ కార్డు లావాదేవీ అనేది యజమాని–ఉద్యోగి సంబంధం కాదని, అది పూర్తిగా రుణదాత–రుణగ్రహీత మధ్య జరిగే వాణిజ్య ఒప్పందం మాత్రమేనని పేర్కొంది. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (అప్పటి ఆంధ్రాబ్యాంకు) ఉద్యోగి ప్రకాశ్‌బాబుపై విధించిన కంపల్సరీ రిటైర్మెంట్‌ శిక్షను రద్దు చేసింది. 

ఆయన పిటిషన్‌ను అనుమతిస్తూ.. సాధారణ పదవీ విరమణ వరకు సేవలో కొనసాగినట్లుగా పరిగణించాలని ఆదేశించింది. అన్ని సర్వీస్, పింఛన్, రిటైర్మెంట్‌ ప్రయోజనాలను 8 వారాల్లో చెల్లించాలని బ్యాంకును ఆదేశించింది. 1979లో ఆంధ్రా బ్యాంకులో ప్రొబేషనరీ అధికారిగా చేరిన ప్రకాశ్‌ బాబు మూడు దశాబ్దాల పాటు సేవలందించారు. ఉద్యోగంలో ఉండగా బ్యాంకు జారీ చేసిన క్రెడిట్‌ కార్డును వినియోగించారు. రూ.లక్ష పరిమితి ఉన్న కార్డులో బకాయి పెరిగి రూ.1.68 లక్షలకు చేరింది. 

చార్జిషిట్‌ జారీ చేసి శాఖాపరమైన విచారణ నిర్వహించిన బ్యాంక్‌.. 2009లో ఆయనపై కంపల్సరీ రిటైర్మెంట్‌ విధించింది. దీన్ని సవాల్‌ చేస్తూ 2012లో ప్రకాశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ జువ్వాడి శ్రీదేవి విచారణ చేపట్టారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. క్రెడిట్‌ కార్డు ఉద్యోగ ప్రయోజనంగా ఇవ్వలేదని, సాధారణంగా మాత్రమే జారీ చేసిందన్నారు. బ్యాంకుకు శాశ్వత ఆర్థిక నష్టం కలిగించాలనే దురుద్దేశం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. వ్యక్తిగత క్రెడిట్‌ కార్డు బకాయిలపై శాఖాపరమైన విచారణ ప్రారంభించడానికి బ్యాంకుకు చట్టపరమైన అధికారం లేదని తేల్చారు.   

Videos

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)