రోజుకు రూ.వెయ్యి జరిమానా

Published on Sat, 08/31/2024 - 05:28

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ అండ్‌ మీడియేషన్‌ సెంటర్‌ (ఐఏఎంసీ) ట్రస్టుకు రూ.300 కోట్ల విలువైన 3.7 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగా కేటాయించడంపై కౌంటర్‌ దాఖలు చేయాలని గత నవంబర్‌లో ఆదేశించినా వేయకపోవడంతో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ తీరును తప్పుబడుతూ, కౌంటర్‌ దాఖలు చేసే వరకు రోజుకు రూ.వెయ్యి చొప్పున తెలంగాణ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీకి జరిమానాగా చెల్లించాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్‌ సర్వే నం.83/1లో 3.70 ఎకరాలను ఐఏఎంసీకి కేటాయిస్తూ 2021, డిసెంబర్‌ 26న రాష్ట్ర ప్రభుత్వం జీవో 126 జారీ చేసింది.

అలాగే నిర్వహణ ఖర్చుల కింద రూ.3 కోట్ల సాయం చేస్తూ మరో జీవో ఇచ్చింది. ఈ జీవోలను సవాల్‌ చేస్తూ న్యాయవాదులు వెంకట్రామిరెడ్డి, కోటి రఘునాథరావు 2023లో హైకోర్టులో వేర్వేరు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. గత నవంబర్‌లో విచారణ సందర్భంగా పిటిషనర్‌ వాదనలు వినిపిస్తూ.. ఉచితంగా భూమి, ఆర్థిక సాయంపై ప్రభుత్వ జీవోలు చట్టవిరుద్ధమన్నారు. ఈ జీవోలను రద్దు చేసి, ఇప్పటికే చెల్లించిన సొమ్మును తిరిగి వసూలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

వాదనలను విన్న ధర్మాసనం.. ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, రెవెన్యూశాఖ కార్యదర్శి, ఐఏఎంసీ సీఈవోలకు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని గత నవంబర్‌లో ఆదేశించింది. ఈ పిల్‌లపై జస్టిస్‌ కె.లక్ష్మణ్, జస్టిస్‌ కె.సుజన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. ఇప్పటివరకు కౌంటర్లు దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి బాధ్యత వహిస్తూ కౌంటర్‌ వేసే వరకు టీఎస్‌ఎల్‌ఎస్‌ఏకి రోజుకు రూ.వెయ్యి చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేసింది.

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)