Breaking News

తార్నాక చౌరస్తా రీ ఓపెన్‌ .. జంక్షన్‌ జాం!

Published on Sat, 04/19/2025 - 07:34

హైదరాబాద్‌: దాదాపు దశాబ్ద కాలం పాటు మూసివేసిన తార్నాక జంక్షన్‌ (సిగ్నల్‌)ను శుక్రవారం రీ ఓపెన్‌ చేశారు. ఇంత కాలం  ఓయూ క్యాంపస్‌ నుంచి లాలాపేట వైపు వెళ్లే వారు యూ టర్న్‌ నుంచి రాకపోకలు సాగించేవారు. సిగ్నల్‌ సిస్టమ్‌ను పునరుద్ధరించడంతో ఓయూ వైపు నుంచి లాలాపేట వైపు వెళ్లే వాహనదారులు నేరుగా సిగ్నల్‌ వద్ద ఆగి వెళుతున్నారు. హబ్సిగూడ నుంచి లాలాపేట వైపు వెళ్లే వాహనదారులకు యథావిధిగా రైల్వే డిగ్రీ కళాశాల వద్ద యూ టర్న్‌ తీసుకువెళ్లాలనీ ట్రాఫిక్‌ పోలీసులు అనౌన్స్‌మెంట్‌ ద్వారా తెలియజేశారు.  

 గుడ్‌ ఫ్రైడే హాలీ డే రోజే ఇలా ఉంటే ఇక వర్కింగ్‌ డే మరింత వాహనాల రద్దీ ఉండే అవకాశం ఉంది. మొదటి రోజు లాలాపేట వైపు సెయింటాన్స్‌ స్కూల్‌ వరకు వాహనాలు నిలిచిపోయాయి.   

తార్నాక, లాలాపేట రోడ్డులో వాహనాల రద్దీ 
తార్నాక జంక్షన్‌ పునరుద్ధరణతో రోజంతా ట్రాఫిక్‌ జాం నెలకొంది.  ఓయూ క్యాంపస్‌ నుంచి తార్నాక, లాలాపేట ప్రధాన రహదారిలో వాహనాలు బారులు తీరాయి. లాలాపేట రోడ్డు విస్తరణ పనులు దాదాపు దశాబ్ద కాలంగా కొనసాగుతున్నాయి. విస్తరణ ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు. ఫలితంగా ఈ మార్గంలో దాదాపు అర కిలో మీటర్‌ మేర ట్రాఫిక్‌జాం నెలకొంది.

యూటర్న్‌తోనే ట్రాఫిక్‌కు చెక్‌   
గతంలో ఉన్న యూ టర్న్‌తో తార్నాక జంక్షన్‌లో వాహనాల రద్దీ తగ్గింది. ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా సాఫీగా కొనసాగింది. పెరిగిన వాహనాల సంఖ్యను అధికారులు పొరపాటుగా అంచనా వేశారు. తార్నాక జంక్షన్‌ విస్తరణ, రోడ్ల విస్తరణ చేపట్టకుండా రీఓపెన్‌ చేయడం సరికాదు. అధికారులు పునరాలోచించాలి.      
 – సూరి, ద్విచక్ర వాహనదారు    

రోడ్డు విస్తరణ చేపడితేనే..  
తార్నాక చౌరస్తా నుంచి లాలాపేట వరకు రోడ్డు ఇరుకుగా మారింది. వాహనాల సంఖ్య భారీగా పెరిగింది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలం చెందారు. ప్రస్తుతం ఉన్న రోడ్డులోనే చిన్నపాటి డివైడర్లు ఏర్పాటు చేసి జంక్షన్‌ను ఓపెన్‌ చేయడంతో వాహనాల రద్దీ నెలకొంది.      – రవి. లాలాపేట, వాహనదారు  

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)