Breaking News

ఉస్మాన్‌ సాగర్‌ గేట్లు ఎత్తనున్న అధికారులు.. మూసీతో టెన్షన్‌

Published on Wed, 07/26/2023 - 11:47

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ సహా తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్ట్‌ల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. అటు లోతట్టు ప్రాంతాలు సైతం జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. 

ఇదిలా ఉండగా.. నగరంలోని జంట జలాశయాలకు సైతం వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో అధికారులు ఉస్మాన్‌సాగర్‌ గేట్లు ఎత్తివేసేందుకు సిద్ధమయ్యారు. ఈరోజు(బుధవారం) మధ్యాహ్నం ఒంటి గంటకు ఉస్మాన్‌ సాగర్‌ గేట్లను లిఫ్ట్‌ చేయనున్నారు అధికారులు. ఉ‍స్మాన్‌సాగర్‌ రెండు గేట్లు ఎత్తి 208 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేయనున్నారు. 

ఇక, ఇప్పటికే అధికారులు హిమాయత్‌ సాగర్‌ నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో, మూసీలోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఈ క్రమంలో మూసీ ఏడు గేట్లను ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు అధికారులు. 

ప్రస్తుతం మూసీ పరిస్థితి..  
ఇన్ ఫ్లో: 13140 క్యూసెక్కులు

అవుట్ ఫ్లో: 10047 క్యూసెక్కులు

పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు

ప్రస్తుత మట్టం: 642.40 అడుగులు

పూర్తిస్థాయి నీటి సామర్థ్యం: 4.46 టీఎంసీలు

ప్రస్తుత నీటి నిల్వ: 3.79 టీఎంసీలు. 
 

ఇది కూడా చదవండి: భారీ వర్షాల ఎఫెక్ట్‌.. టెన్షన్‌ పెడుతున్న మున్నేరు, పాలేరు

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)