Breaking News

భువనగిరి: రామన్నపేటలో టెన్షన్‌.. భారీగా పోలీస్ బందోబస్తు

Published on Wed, 10/23/2024 - 08:33

సాక్షి, భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలో​ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రామన్నపేటలో ఏర్పాటు చేయనున్న అదానీ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ నేపథ్యంలో రామన్నపేటలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు.. కంపెనీ ఏర్పాటును అఖిలపక్షం నేతలు వ్యతిరేకిస్తున్నారు.

రామన్నపేటలో అంబుజా సిమెంట్స్ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే లింగయ్య అరెస్ట్. పోలీసులతో లింగయ్య వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో​ పోలీసు వాహనంలో లింగయ్యను స్టేషన్‌కు తరలించినట్టు తెలుస్తోంది. 

ఇక, ప్రజాభిప్రాయ సేకరణ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అభిప్రాయ సేకరణ చేస్తున్న ప్రాంతానికి భారీగా చేరుకుంటున్నారు అఖిలపక్ష నేతలు. ఈ సందర్భంగా పోలీసులు స్థానికేతరులను అడ్డుకుని వెనక్కి పంపిస్తు​న్నారు.  అభిప్రాయసేకరణను జరగనివ్వమని అఖిలపక్ష నేతలు చెబుతున్నారు. మరోవైపు.. స్థానికులు కూడా అంబుజా గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేస్తున్నారు. 

రామన్నపేట పట్టణ కేంద్రంలో అదానీ అంబుజా సిమెంట్ పరిశ్రమకు అనుమతి ఇవ్వద్దని పలు గ్రామాల ప్రజలు, స్థానిక రాజకీయ నాయకులు మంగళవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టారు. ఈ పరిశ్రమ ఏర్పాటు చేయడం వల్ల కాలుష్య సమస్య తలెత్తి ప్రజా ఆరోగ్యాలు దెబ్బ తినడంతో పాటు పచ్చటి పంట పొలాలు నాశనం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేస్తామని మండల పరిధిలోని కొమ్మాయిగూడెంలో సుమారు 350 ఎకరాలను కొనుగోలు చేసి అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి ఏర్పాటుకు ఈనెల 23న ప్రజాభిప్రాయ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో ఫ్యాక్టరీకి అనుమతులు ఇవ్వకూడదని డిమాండ్‌ చేశారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)