Breaking News

జూరాల 10 గేట్లు ఎత్తివేత

Published on Sat, 08/24/2024 - 05:13

ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద మొదలైంది. గురువారం సాయంత్రం 55 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా..శుక్రవారం రాత్రి 9 గంటల సమయానికి 89 వేల క్యూసెక్కులకు పెరిగింది. దీంతో ఉదయం 20 గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేయగా...సాయంత్రం నాలుగు గేట్లను, రాత్రి మరో ఆరు గేట్లు మూసివేసి ప్రాజెక్టు 10 క్రస్టు గేట్ల ద్వారా వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ, దిగువ జన్‌కోజల విద్యుత్‌ కేంద్రంలో 11 యూనిట్లలో విద్యుదుత్పత్తిని చేపడుతున్నారు. 

దిగువకు 81,912 క్యూసెక్కుల నీరు
క్రస్టు గేట్ల ద్వారా 41,400 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి కోసం 37,237 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 95, నెట్టెంపాడుకు 1,500 , కుడి కాల్వకు 500, ఎడమ కాల్వకు 550, కోయిల్‌సాగర్‌కు 630, ఆర్‌డీఎస్‌ లింక్‌ కెనాల్‌కు 100, భీమా లిఫ్టు–2కు 750 క్యూసెక్కులు..ఇలా మొత్తం ప్రాజెక్టు నుంచి 81,912 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

సాగర్‌కు 69,132 క్యూసెక్కుల నీరు
జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 9.132 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇదిలా ఉండగా...ఎగువన ఉన్న నారాయణపూర్‌ ప్రాజెక్టుకు 30,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... 6వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల, సుంకేçశుల, హంద్రీ నుంచి 1,14,689 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... ఎడమ, కుడి భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ సాగర్‌కు 69,132 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

Videos

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)