Breaking News

వడగళ్లవానతో భారీ నష్టం

Published on Mon, 03/18/2024 - 02:28

సాక్షి, కామారెడ్డి: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చింది. శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఈదురు గాలులతో కురిసిన వడగళ్ల వానతో పంటలు దెబ్బతిన్నాయి. కామారెడ్డి జిల్లాలో 15 మండలాల్లోని 130 గ్రామాల్లో 20,071 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీంతో 14,553 మంది రైతులు నష్టపోయారని నివేదికలో పేర్కొన్నారు.

వరి 16,298 ఎకరాల్లో, మక్క 2,784.16 ఎకరాల్లో, జొన్న 705.2 ఎకరాల్లో, గోధుమ ఐదు ఎకరాల్లో, ఉల్లిగడ్డ 12 ఎకరాలు, బొప్పాయి పది ఎకరాలు, పొగాకు 20 ఎకరాలు, మామిడి 192 ఎకరాలు, కూరగాయలు 45 ఎకరాల్లో దెబ్బతిన్నాయని పేర్కొ న్నారు. తాడ్వాయి మండలంలోని బ్రహా్మజీవాడి గ్రామంలో గాలిదుమారానికి రేకుల షెడ్డు కూలిపోవడంతో అందులో ఉన్న రెండు ఆవులు, నాలుగు దూడలు అక్కడికక్కడే మృతిచెందాయి.

మరోనాలుగు గేదెలకు తీవ్ర గాయాలయ్యాయి.  నిజామాబాద్‌ జిల్లాలో 6,058 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పది మండలాల్లోని 44 గ్రామాల్లో వడగళ్లు బీభత్సం సృష్టించాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. 3,076 మంది రైతులు నష్టపోయారన్నారు. అత్యధికంగా 5,661 ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లింది. 292 ఎకరాల్లో మక్క, 93 ఎకరాల్లో జొన్న, 12 ఎకరాల్లో నువ్వుల పంట దెబ్బతిన్నదని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)