Breaking News

వరద ఎఫెక్ట్‌.. కొట్టుకుపోయిన ఏడుపాయల గర్భగుడి షెడ్డు

Published on Sun, 09/28/2025 - 11:20

సాక్షి, మెదక్‌: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. మెదక్‌ జిల్లాలోని ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం వద్ద మంజీరా ఉగ్ర రూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల వరద పోటెత్తడంతో దుర్గమ్మ ఆలయం వద్ద మంజీరా నదీపాయ పొంగిపొర్లుతోంది. దీంతో, గత 15 రోజులుగా ఆలయం వరదల్లోనే ఉంది.

వివరాల ప్రకారం.. సింగూరు ప్రాజెక్టు నుండి ఒక లక్షా 20 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన నేపథ్యంలో మంజీరా నదికి వరద నీరు పోటెత్తింది. దీంతో, గర్భగుడి మండపం పూర్తిగా వరదల్లో కొట్టుకుపోయింది. ఏడుపాయల వద్ద పదేళ్ల తర్వాత మళ్లీ ఇంత వరద వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదకర స్థాయిలో మంజీరా నది ప్రవహిస్తోంది.

వరద తీవ్రతతో కొట్టుకుపోయిన ప్రసాదాల పంపిణీ కేంద్రం షెడ్డు సైతం కొట్టుకుపోయింది. ఇప్పటికే ఆలయానికి వెళ్లే మూడు దారులను పోలీసులు మూసివేశారు. అమ్మవారి దర్శనానికి ఎవరు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి నుంచి ఏడుపాయలకు వెళ్లే మొదటి బ్రిడ్జి వద్ద అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు పాపన్నపేట మండలం నాగ్సాన్ పల్లి నుంచి వెళ్లాలని కొల్చారం పోలీసులు సూచిస్తున్నారు. 

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)