Breaking News

కిక్కుతో వీడ్కోలు!

Published on Wed, 01/01/2025 - 06:12

సాక్షి, హైదరాబాద్‌: కొత్త సంవత్సరానికి మందుబాబులు ఘన స్వాగతం పలికారు. డిసెంబర్‌ నెలలో రాష్ట్రవ్యాప్తంగా రూ.3,523 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగ్గా, చివరి ఆరు రోజుల్లోనే రూ.1,220 కోట్ల మద్యం అమ్ముడుపోయింది. అంటే నెల మొత్తంలో విక్రయించిన దాంట్లో చివరి ఆరు రోజుల్లో దాదాపు 40 శాతానికి పైగా అమ్మకాలు జరిగాయి. దీన్ని బట్టి 2024 సంవత్సరానికి మందుబాబులు మంచి కిక్కుతో వీడ్కో­లు పలికినట్లు అర్థమవుతోంది. 

ఎక్సైజ్‌ గణాంకాల ప్రకారం ఒక్క సోమవారమే (డిసెంబర్‌ 30) రికార్డు స్థాయిలో 7.7 లక్షలకు పైగా కేసుల మద్యం, బీర్లు డిపోల నుంచి షాపులకు వెళ్లాయి. ఆ మద్యం విలువ రూ. 402 కోట్ల పైమాటే. ఈ ఏడాది డిసెంబర్‌ నెలలో సగటున రోజుకు రూ.117 కోట్ల విలువైన మద్యం అమ్ముకాలు జరగ్గా.. సోమవారం దాదాపు నాలుగింతలు అమ్ముడయిందని గణాంకాలు చెబుతున్నాయి. అంతకుముందు ఆదివారం (డిసెంబర్‌ 29) కూడా మద్యం డిపోలు తెరచే ఉంచారు. 

బ్యాంకులు లేకపోయినా వైన్‌షాపుల యజమానులు తీసుకున్న పాత డీడీలతో రూ.50 కోట్లకు పైగా విలువైన మద్యాన్ని డిపోల నుంచి తీసుకెళ్లారు. ఇక, గత ఆరు రోజుల విక్రయ గణాంకాలు 2023 సంవత్సరం డిసెంబర్‌లోని చివరి ఆరు రోజులతో పోలిస్తే దాదాపు ఒకే స్థాయిలో ఉన్నాయి. డిసెంబర్‌ నెల మొత్తంతో పోలిస్తే మాత్రం 2023 కంటే ఈసారి లిక్కర్‌ అమ్మకాలు భారీగా పడిపోవడం గమనార్హం. 2023, డిసెంబర్‌ నెలలో రూ.4,147.18 కోట్ల విలువైన మద్యం అమ్ముడు పోగా, ఈ డిసెంబర్‌లో రూ.3,523 కోట్లకే పరిమితమైంది.

Videos

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)