Breaking News

నిమ్స్‌లో హార్ట్‌ వాల్వ్‌ బ్యాంకు!

Published on Wed, 08/14/2024 - 05:00

లక్డీకాపూల్‌: గుండెకు మరింత భరో సా కల్పించే దిశగా నిజామ్స్‌ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్‌) అడుగులు వేస్తోంది. గుండె సమస్యలతో బాధపడుతున్న పేద రోగుల్లో అవసరమైన వారికి ఉచితంగా గుండె కవాటా(హార్ట్‌ వాల్వ్‌)లను అందించేందుకు నిమ్స్‌ సమాయత్తమైంది. ప్రస్తుతం ఆస్పత్రిలో గుండె సిరలు దెబ్బతిన్న వారికి కృత్రిమంగా తయారు చేసిన వాటిని అమరుస్తున్నారు. 

ఖర్చుతో కూడుకున్న ఈ వాల్వ్‌ల మార్పిడి ఆపరేషన్‌ నిరుపేదలకు పెనుభారంగా తయారైంది. దీంతో పేదలకు ఉచితంగా అందించేందుకు ఆస్పత్రిలో ప్రత్యేకంగా హార్ట్‌ వాల్వ్‌ బ్యాంకు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో స్థల పరిశీలన జరుగుతోంది. త్వరలోనే హార్ట్‌ వాల్వ్‌ బ్యాంక్‌ను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో  ప్రారంభించాలని భావిస్తున్నారు.  

బ్రెయిన్‌ డెడ్‌ అయిన వాళ్ల నుంచి సేకరణ..
బ్రెయిన్‌ డెడ్‌కు గురైన వాళ్ల నుంచి అవ యవాలను నిమ్స్‌ సేకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మృతుని కుటుంబసభ్యుల అంగీకారంతో కిడ్నీ లు, కాలేయం, కళ్లు, గుండె తదితర కీలక అవయవాలను సేకరిస్తోంది. అదే విధంగా బ్రెయిన్‌ డెత్‌కు గురైన వాళ్ల నుంచి గుండె కవాటాలను కూడా సేకరించి.. వాటిని భద్రపర్చేందుకు ప్రత్యేక విభాగాన్ని(హార్ట్‌ బ్యాంక్‌) ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. 

ఈ బ్యాంకులో భద్రపరిచిన కవాటాలను పూర్తిగా ఉచితంగా అందించడంతో నిమ్స్‌కు వచ్చే రోగులు చాలా తక్కువ ఖర్చుతోనే శస్త్ర చికిత్సలు చేయించుకోవచ్చని నిమ్స్‌ అసిస్టెంట్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాకేశ్‌ తెలిపారు.

 

#

Tags : 1

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)