Breaking News

హైబీపీతో హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాసులు మృతి

Published on Wed, 01/03/2024 - 09:51

కల్వకుర్తి టౌన్‌: విధి నిర్వాహణలో పోలీస్‌స్టేషన్‌ వాచ్‌ ఇన్‌చార్జి కుప్పకూలి పడిపోయి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మంగళవారం కల్వకుర్తిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రమేష్‌ వివరాల ప్రకారం.. పట్టణ  పోలీస్‌స్టేషన్‌లో మూడు నెలల క్రితం డ్యూటీలో చేరిన శ్రీనివాస్‌ (51) వాచ్‌ ఇన్‌చార్జిగా పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి 9గంటల సమయంలో విధుల్లో ఉన్న ఆయనకు బీపీ తగ్గడంతో కిందపడిపోయాడు. వెంటనే అతన్ని కల్వకుర్తి ఆస్పత్రికి తరలించారు.

 మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఇంటర్నల్‌ బ్లీడింగ్‌ ఎక్కువ అయినట్లు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని శ్రీనివాస్‌ స్వస్థలం నాగర్‌కర్నూల్‌ మండలం తూడుకుర్తికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అయనకు భార్య, కూతురు ఉంది.  

పోలీసుల నివాళి  
డ్యూటీలో శ్రీనివాస్‌ చాలా నిబద్ధతో పనిచేసే వాడని కల్వకుర్తి డీఎస్పీ పార్థసారథి తెలిపారు. శ్రీనివాస్‌ చిత్రపటానికి సీఐ, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లతో కలిసిపూలమాలలు వేసి నివాళులు అరి్పంచారు. బాధిత కుటుంబాన్ని డిపార్టుమెంట్‌ తరుపున ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.  కార్యక్రమంలో సీఐ ఆంజనేయులు, ఎస్‌ఐలు రమేష్, రాజు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.   

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు