Breaking News

కేఏ పాల్‌ సభకు హైకోర్టు అనుమతి

Published on Sat, 05/24/2025 - 11:49

సాక్షి, హైదరాబాద్‌: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ శనివారం సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్‌లో ప్రపంచ శాంతి ఉత్సవం నిర్వహించుకొనేందుకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. సభలో వెయ్యి మందికి మించి ప్రజలు పాల్గొనరాదని.. ప్రార్థనలు మినహా ఇతర ప్రేరేపిత ప్రసంగాలు చేయరాదని సభ నిర్వహిస్తున్న గ్లోబల్‌ పీస్‌ ఫెస్టివల్‌కు స్పష్టం చేసింది. సభ శాంతియుతంగా సాగేలా పోలీసులు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.

 ఏదైనా అనుకోని ఘటన జరిగితే దానికి సొసైటీనే బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. నిబంధనలు ఉల్లంఘించినా లేక దేశ ప్రయోజనాలకు, సమగ్రతకు విరుద్ధమైన నినాదాలు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవచ్చని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. సభకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాల్‌ చేస్తూ గోస్పెల్‌ సొసైటీ హైకోర్టులో దాఖలు చేసిన హౌస్‌మోషన్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ నందికొండ నర్సింగ్‌రావు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.  

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)