Breaking News

ప్రేమ కథ.. విషాదాంతం

Published on Thu, 01/08/2026 - 07:00

యాచారం, హయత్‌నగర్‌: ప్రేమ వ్యవహారం ఇద్దరి ప్రాణాలను బలిగొనడంతో పాటు ఇరుకుటుంబాల్లో తీరని విషాదం నింపింది. నక్కర్తమేడిపల్లి గ్రామానికి చెందిన సిద్దగోని యాదయ్య, పార్వతమ్మల కుమారుడైన మహేశ్‌ (20), పోతురాజు మహేశ్, అలివేలు కూతురు పూజ (17) ప్రేమించుకున్నారు. పూజ ఇంటర్‌ సెకండియర్, మహేశ్‌ డిగ్రీ చదువుతున్నారు. వీరి ప్రేమ వ్యవహారం తెలియడంతో ఇరు కుటుంబాల పెద్దలు తీవ్రంగా మందలించారు. దీంతో మనస్తాపం చెందిన ఇద్దరూ గతంలో ఆత్మహత్యకు ప్రయత్నించారు.

 ప్రాణాలతో బయటపడి, పరిస్థితి సద్దుమణుగుతోందనుకుంటున్న సమయంలో మహేశ్‌ మళ్లీ పూజకు ఫోన్‌ చేసి, తనను పెళ్లి చేసుకోవాలని లేదంటే చనిపోతానని వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలియడంతో పూజ తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. దీంతో మహేశ్‌ వేధింపులు తీవ్రం చేయగా, మనస్తాపానికి గురైన పూజ మంగళవారం ఇంట్లోనే ఉరేసుకుని చనిపోయింది. ఎంతగానో ప్రేమించిన ప్రియురాలు చనిపోవడం, పోలీసులు తనకోసం వెదకడంతో ఆందోళనకు గురైన మహేశ్‌ మంగళవారం గ్రామం వదిలి, హయత్‌నగర్‌లోని స్నేహితుల ఇంటికి వెళ్లాడు. 

పూజ మృతితో కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్‌ గ్రీన్‌ ఫార్మాసిటీ పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. దీంతో భయాందోళనకు గురైన అతను బుధవారం ఉదయం హయత్‌నగర్‌ సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని, నిప్పంటించుకుని, తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. లొకేషన్‌ ఆధారంగా వెళ్లిన పోలీసులకు మృతదేహం లభ్యమైంది. 24 గంటల్లో ఇద్దరి మృతితో నక్కర్తమేడిపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.   

#

Tags : 1

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)