Breaking News

జ్యోతిష్యం చెప్తుండగా టైర్‌ పేలి తుర్రుమన్న చిలుక

Published on Fri, 04/18/2025 - 08:40

హనుమకొండ జిల్లా: అత్యాశ కొంపకు చేటు అన్నట్లు.. ఓ రామచిలుక జ్యోతిష్యుడు చేసిన పని అతడి ఉపాధికి ఎసరు తెచ్చింది. చినికి చినికి చిలుక పంచాయితీ పోలీసు స్టేషన్‌కు చేరింది. వారం రోజులుగా జరుగుతున్న ఈ చిలుక పంచాయితీ వివరాల్లోకి వెళ్తే.. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని అంబేడ్కర్‌ క్రాస్‌ సమీపంలో దాస్‌ అనే ఓ బైక్‌ మెకానిక్‌ దుకాణం వద్దకు వారం క్రితం రామస్వామి అనే జ్యోతిష్యుడు చిలుక జోస్యం చెబుతానని వచ్చాడు. దాస్‌ జోస్యం చెప్పించుకునేందుకు ఒప్పుకోవటంతో, చిలుక తీసిన బొమ్మను చూసి జ్యోతిష్యుడు రూ.1,650 ఇస్తే తాయత్తు కడతానని చెప్పాడు. 

అయితే పొద్దున్నే గిరాకీ కాలేదని, తర్వాత రమ్మని దాస్‌ చెప్పి జ్యోతిష్యుడిని పంపించేశాడు. ఆ జ్యోతి ష్యుడు ఊరంతా తిరిగి సాయంత్రానికి మళ్లీ దాస్‌ వద్దకు వచ్చాడు. చిలుక మళ్లీ అదే బొమ్మను తీస్తే తాయత్తు కట్టించుకుంటానని దాస్‌ చెప్పాడు. దీంతో ఆ జ్యోతిష్యుడు మరోసారి పంజరంలో ఉన్న చిలుకను బయటకు పిలుస్తూనే నిద్రలోకి జారుకున్నాడు. చిలుక బయటకు వచ్చిన సమయంలో పక్కనే ఓ బైక్‌ టైరు పేలటంతో, ఆ శబ్ధానికి భయపడి అది తుర్రుమని ఎగిరి సెల్‌టవర్‌పై వాలింది. చిలుక పారిపోయిందని జ్యోతి ష్యుడిని దాస్‌ నిద్ర లేపడంతో, అతడు ఒక్కసారిగా లేచి సెల్‌ టవర్‌ వద్దకు పరుగెత్తాడు.

 కానీ, మూడు గంటలు వేచి చూసినా అది తిరిగి రాలేదు. జ్యోతి ష్యుడి బాధ చూడలేక దాస్‌ అతడిని ఓ వైన్స్‌ వద్దకు తీసుకెళ్లి రూ.500తో మద్యం కొనిచ్చాడు. అయితే, తన చిలుకను దాస్‌ మాయం చేశాడని అతడి ఇంటికి వెళ్లి జ్యోతిష్యుడు గొడవ చేశాడు. మూడు రోజుల క్రితం దాస్‌పై పరకాల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు దాస్‌ను పిలిచి జ్యోతిష్యుడి రామచిలుక ఏమైందని ప్రశ్నించారు. దాదాపు 3 గంటల పాటు చిలుక పంచాయితీ జరిగినా, ఎటూ తెగకపో వడంతో ‘నీ చిలుక నీ దగ్గరకు రావాలని కోరుకుంటున్నాం’అని జ్యోతిష్యుడికి నచ్చజెప్పి పంపించేశారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)