Breaking News

వారిద్దరి వల్లే నా జీవితం నాశనం.. మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య

Published on Fri, 01/30/2026 - 11:04

సాక్షి, హన్మకొండ: పోకిరీల ఆటకట్టించే పోలీసే వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఘటన హన్మకొండ జిల్లాలో చోటుచేసుఏకుంది. ఇద్దరు యువకుల వేధింపులతో మహిళా కానిస్టేబుల్ అనిత ఆత్మహత్య చేసుకుంది. ఒకడు ప్రేమించి మోసం చేయగా.. మరొకడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి వేధింపులకు గురిచేయడంతో అనిత ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సీత్యాతండాకు చెందిన అనిత వరంగల్ పోలీస్ కమిషనరేట్‌ ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తుంది. అయితే, మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం కొమ్మనపల్లి తండాకు చెందిన రాజేందర్.. అనితకు బంధువు అవుతాడు. అనితను పెళ్లిచేసుకుంటానని రాజేందర్‌ గత నాలుగేళ్లుగా చెబుతూ వస్తున్నాడు. కానీ, డ్యూటీలో ఉండగా వీడియో కాల్ చేయాలని.. వేరే ఎవరితోనూ చనువుతో మాట్లాడవద్దని కొంతకాలంగా వేధింపులకు పాల్పడ్డాడు. రాజేందర్ వైఖరి నచ్చకపోవడంతో ఈ విషయాన్ని అనిత తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో అనితను ఇచ్చి పెళ్లి చేయడం కుదరదని రాజేందర్‌కు తెగేసి చెప్పాడు. అయినా అనితను ఇచ్చి పెళ్లి చేయాలని బతిమిలాడుతూనే ఉన్నాడు.

ఈ క్రమంలో అనితకు తన క్లాస్‌మేట్ జబ్బార్‌ లాల్‌తో చనువు ఏర్పడింది. అతడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయం రాజేందర్‌కు తెలిసింది. దీంతో, కోపంతో జబ్బార్‌కు రాజేందర్ ఫోన్ చేసి అనిత గురించి తప్పుగా చెప్పాడు. అప్పటి నుంచి జబ్బార్ కూడా అనితను వేధించడం మొదలుపెట్టాడు. పెళ్లి చేసుకోవాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. ఇద్దరి వేధింపులతో మానసికంగా కుంగిపోయిన అనిత ఈ నెల 27న రాజేందర్‌కు ఫోన్ చేసి కన్నీళ్లు పెట్టుకుంది.

నువ్వు, జబ్బార్ కలిసి నా జీవితాన్ని నాశనం చేశారు.. మీ వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పింది. కానీ రాజేందర్ ఆ మాటలను ఏ మాత్రం పట్టించుకోలేదు. చస్తే చావు అంటూ రాజేందర్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దీంతో వెంటనే గడ్డిమందు తాగి అనిత ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు అనితను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ అనిత మరణించింది. అనిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)