‘నా కొడుకా.. నీకప్పుడే నూరేళ్లు నిండాయారా’

Published on Wed, 07/12/2023 - 19:17

ఆడుతూ పాడుతూ అల్లరి చేయాల్సిన ఆ చిన్నారిని మృత్యువు వీధి కుక్కల రూపంలో వెంటాడింది. ఆపై గాయాలతో ఆస్పత్రిలో చేరాడు. తనకు ఏం జరుగుతుందో అర్థం కాక.. అక్కడా అయినవాళ్ల నడుమ ఆడుకుంటూ కనిపించాడు. కానీ, విధి మరొకటి తలిచింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి కన్నుమూశాడు. ఆ తల్లిదండ్రులు గుండెలు అవిసెలా రోదించారు. హన్మకొండ జిల్లా పరిధిలో జరిగిన విషాదం.. స్థానికుల చేత కంటతడి పెట్టిస్తోంది. 

వీధి కుక్కలు మరో చిన్నారిని బలిగొన్నాయి. కిందటి నెలలో కుక్కల దాడిలో గాయపడి.. వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి రాజు(18 నెలలు) కన్నుమూశాడు. దీంతో కాజీపేట రాజీవ్‌ గృహకల్ప కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

రాజీవ్ గృహకల్ప కాలనీలో రాజు కుటుంబం ఉంటోంది. గత నెల(జూన్‌) 17వ తేదీన ఆడుకుంటున్న పిల్లలపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా, 18 నెలల రాజుకి తీవ్ర గాయాలయ్యాయి. మొహంపై గాయాలతో పాటు చెంప కొంత వరకు తెగిపోయింది. పిల్లల అరుపులు విన్న స్థానికులు.. ఇళ్లలోంచి వచ్చి కుక్కలను తరిమి కొట్టారు. ఆపై పిల్లలను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. 

ఎంజీఎంలో చిన్నారి రాజు ఫస్ట్‌ ఎయిడ్‌ తర్వాత ఆడుకుంటున్న దృశ్యాలను మొబైల్‌లో బంధించారు. ఆపై చికిత్స కోసం అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే..  క్రమక్రమంగా రాజు పరిస్థితి క్షీణిస్తూ వచ్చింది. 25 రోజులపాటు మృత్యువుతో పోరాడి బుధవారం ఆ చిన్నారి మృతి చెందినట్లు తెలుస్తోంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)