Breaking News

గుర్రంపోడు ఎస్‌ఐ సస్పెన్షన్‌

Published on Tue, 10/15/2024 - 05:47

గుర్రంపోడు/హైదరాబాద్‌: హత్య కేసులో నిందితులతో కుమ్మక్కైన గుర్రంపోడు ఎస్‌ఐ వేమిరెడ్డి నారాయణరెడ్డిని సస్పెండ్‌ చేస్తూ ఐజీపీ వి.సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. వివరాలివి. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం ముల్కలపల్లి గ్రామంలో ఆగస్టు 29న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన జాల రజిత (32) కేసును తొలుత ఆత్మహత్యగా నమోదు చేయడంతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

దీనిపై ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌.. ఏఎస్పీ రాములునాయక్‌ నేతృత్వంలో ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. ప్రధాన నిందితుడు రాములుపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించినప్పటికీ.. మిగతా నిందితులను కేసు నుంచి తప్పించేందుకు ఎస్‌ఐ.. కానిస్టేబుల్‌ (నంబర్‌ 3524) ద్వారా రూ.లక్ష లంచం తీసుకున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. హత్య కేసు నమోదు చేయడంతోపాటు సహ నిందితులైన రాములు భార్య జాల పార్వతమ్మ, అన్న కుమారుడు జాల వెంకటయ్యను పోలీసు ఉన్నతస్థాయి విచారణ బృందం అదుపులోకి తీసుకుని విచారించగా హత్యలో ముగ్గురు పాల్గొన్నట్లు తేలింది.

ఏ2, ఏ3 నిందితులను రక్షించే ప్రయత్నం జరిగినట్లు తేలడంతో ఎస్‌ఐపై చర్య తీసుకున్నారు. గుర్రంపోడు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేసి వెళ్లిన అనంతరం ఎస్‌ఐ నారాయణరెడ్డిని సస్పెండ్‌ చేస్తూ ఐజీపీ ఉత్తర్వులు వెలువడ్డాయి.

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)