Breaking News

వలస కార్మికులకు మొండిచేయి

Published on Fri, 03/21/2025 - 16:31

మోర్తాడ్‌(బాల్కొండ): గల్ఫ్‌ వలస కార్మికులకు మరోసారి మొండిచేయి ఎదురైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో.. ఎన్నో సంక్షేమ పథకాలకు నిధులను కేటాయించిన తెలంగాణ‌ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్‌ వలస కార్మికుల ఆశలను తీర్చలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2023 ఎన్నికల మేనిఫెస్టోలో.. గల్ఫ్‌ వలస కార్మికుల అంశంపై ప్రత్యేక హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ (Congress Party) అధికారంలోకి వచ్చిన తరువాత పట్టించుకోపోవడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. 

2024–25 ఆర్థిక సంవత్సరంలో గల్ఫ్‌ దేశాల్లో మృతి చెందిన వలస కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడానికి ప్రభుత్వం రూ.7.50 కోట్లను ఖర్చు చేసింది. ఈసారి మాత్రం ఎలాంటి కేటాయింపులు లేకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గల్ఫ్‌ బోర్డు ఏర్పాటుతో పాటు రూ.500 కోట్ల కేటాయింపులే లక్ష్యంగా వలస కార్మిక సంఘాలు కృషి చేశాయి. 

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు ఆయన మంత్రివర్గ సహచరులతో అనేకమార్లు సమావేశాలను నిర్వహించారు. సీఎం కూడా గల్ఫ్‌ వలస కార్మికుల ఆశలు తీర్చడానికి సానుకూలంగానే స్పందించారు. తీరా బడ్జెట్‌లో కేటాయింపులు లేకపోవడం, కనీసం వలస కార్మికుల సంక్షేమం ప్రస్తావనే లేకపోవడంతో వలస కార్మికులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు.

బీఆర్‌ఎస్‌ బాటలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం.. 
పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీ ఎప్పుడూ వలస కార్మికులను పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ తీరుపైనా అలాంటి ఆరోపణలే వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఎన్నోమార్లు చర్చించి.. గల్ఫ్‌ వలస కార్మికులు, వారి కుటుంబాల ఓట్లను రాబట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీ మెజార్టీ సీట్లను గెలుచుకుంది. గల్ఫ్‌ ఓటర్ల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులే గెలుపొందేవారు. ఒకవేళ ఓడినా.. ఓట్లలో వ్యత్యాసం తక్కువగా ఉండేది. అయినా వలస కార్మికులను కరివేపాకులాగా తీసి పారేశారని కార్మిక సంఘాలు వాపోతున్నాయి.

చ‌ద‌వండి: యూఏఈకి ఉచిత వీసాలు.. న‌కిలీ గ‌ల్ప్ ఏజెంట్ల‌కు చెక్‌

ప్రభుత్వ తీరు సరికాదు 
వలస కార్మికుల ఆశలు తీర్చేలా బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయని ఆశించాం. ప్రభుత్వం ఎలాంటి కేటాయింపులు చేయక నిరాశ మిగిల్చింది. వలస కార్మికుల శ్రమకు గుర్తింపు లేకపోవడం శోచనీయం. వలస కార్మికులు పంపే విదేశీ మారకద్రవ్యం అవసరం కానీ వారి సంక్షేమం పట్టక పోవడం సరైంది కాదు. 
– గుగ్గిల్ల రవిగౌడ్, చైర్మన్, గల్ఫ్‌ జేఏసీ   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)