Breaking News

గ్రూప్‌–1 పరీక్షలు యథాతథం!

Published on Sun, 10/20/2024 - 04:42

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలు నిర్దేశించిన షెడ్యూల్‌ ప్రకారం జరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికకు పాటించిన విధానంతో రిజర్వుడ్‌ కేటగిరీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, అందువల్ల పరీక్షలను వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు అభ్యర్థులు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ను కలిసి తమ సమస్యలను ప్రస్తావించారు. 

ఈ క్రమంలో చొరవ తీసుకున్న మహేశ్‌కుమార్‌ గౌడ్‌ శనివారం సాయంత్రం మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లోని పొన్నం ప్రభాకర్‌ నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖతోపాటు టీజీపీఎస్సీ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్రూప్‌–1 అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలు, సమస్యలను మహేశ్‌ గౌడ్‌ ప్రస్తావించారు. 

ప్రధానంగా జీఓ 29పై అభ్యర్థుల్లో భిన్నాభిప్రాయాలు, అనుమానాలున్నాయన్నారు. ఈ క్రమంలో దీనిపై కోర్టు ఉత్తర్వులు, న్యాయపరమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ పరీక్షలో ఏ విద్యార్థికీ అన్యాయం జరగొద్దని, రిజర్వేషన్ల పరంగా ఎలాంటి నష్టం కలగకుండా అన్ని వర్గాలకు న్యాయం జరగాలని మంత్రులు స్పష్టం చేశారు. మంత్రులు లేవనెత్తిన ప్రశ్నలకు అధికారులు సాంకేతికపరమైన వివరణలు ఇచ్చారు. 

అనంతరం పరీక్షల నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది లేదనే అంచనాకు వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పరీక్షలు యధాతథంగా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఆదివారం ప్రభుత్వం ప్రకటన చేయనున్నట్లు సమాచారం. 

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)