Breaking News

నిధుల సేకరణకు గ్రీన్‌సిగ్నల్‌

Published on Sun, 07/07/2024 - 04:26

సాక్షి, హైదరాబాద్‌: మూలధన వ్యయంతో పాటు ఇతర అవసరాల కోసం రుణ మార్కెట్‌ నుంచి ప్రాథమికంగా రూ. 5 వేల కోట్ల మేర నిధులు సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధ మైంది. తెలంగాణ పారిశ్రామిక మౌలికవసతుల కల్పన సంస్థ (టీజీఐఐసీ) ద్వారా రుణం తీసుకొనేందుకు అవసరమైన ప్రక్రియను ప్రారంభించింది. నిధుల సేకరణ బాధ్యతను రుణాలు ఇప్పించడంలో అనుభవంగల ‘మర్చంట్‌ బ్యాంకర్‌’కు అప్పగించాలని నిర్ణయించింది. 

మర్చంట్‌ బ్యాంకర్‌ ఎంపికకు గత నెల 23న జారీ చేసిన టెండర్‌ను రద్దు చేసిన టీజీఐఐసీ... తాజాగా మరో టెండర్‌ షెడ్యూ ల్‌ను విడుదల చేసింది. దీనిప్రకారం ఈ నెల 12లోగా ఫైనాన్షియల్‌ సంస్థలు బిడ్లు దాఖలు చేసుకోవచ్చు. అదేరోజు సాయంత్రం సాంకేతి క బిడ్లను తెరిచి అర్హతగల సంస్థలకు సమా చారం ఇస్తారు. 

2019–24 మధ్య రుణ మార్కె ట్‌ నుంచి రూ. 20 వేల కోట్లకుపైగా సేకరించిన సంస్థలకు ఎంపికలో ప్రాధాన్యత ఇస్తారు. ఎంపికైన బిడ్డర్‌ కనీసం రూ. 5 వేల కోట్ల మేర నిధులు సేకరించి ఇవ్వాల్సి ఉంటుంది. రుణం సేకరించి ఇచ్చే మర్చంట్‌ బ్యాంకర్‌కు కనీసం ఒక శాతం కమీషన్‌ లభించే అవకాశం ఉంది. టీజీఐఐసీ ఎంపిక చేసే మర్చంట్‌ బ్యాంకర్‌ నిధుల సేకరణకు అవసరమయ్యే అన్ని రకాల అనుమతులు, క్లియరెన్సులు, లైసెన్సులు తదితరాల బాధ్యతలు చూసుకోవాలి.

రూ. 10 వేల కోట్లు సేకరణ లక్ష్యం..?
టీజీఐఐసీ ఎంపిక చేసే మర్చంట్‌ బ్యాంకర్‌ కనీసం రూ. 5 వేల కోట్ల నిధులు సేకరించాలనే లక్ష్యాన్ని టీజీఐఐసీ విధించింది. అయితే ఒకరికంటే ఎక్కువ మంది మర్చంట్‌ బ్యాంకర్లను ఎంపిక చేసి మొత్తంగా రూ. 10 వేల కోట్లు సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. 

టీజీఐఐసీ వద్ద ఉన్న పరిశ్రమల భూముల బ్యాంకు నుంచి కోకాపేట, రాయదుర్గం ప్రాంతంలోని 400 ఎకరాలకుపైగా భూమిని కుదువ పెట్టడం ద్వారా రూ. 10 వేల కోట్లు సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. విలువైన ప్రాంతంలో ఉన్న ఈ భూముల విలువను సగటున ఎకరాకు రూ. 50 కోట్లుగా లెక్కకట్టినట్లు సమా చారం. 

వీలైనంత త్వరగా నిధుల సేకరణ ప్రక్రియను ప్రారంభించాలని టీజీఐఐసీ భావిస్తోంది. రుణ మార్కెట్‌ నుంచి టీజీఐఐసీ రూ.10వేలు కోట్లు సేకరించేందుకు ప్రయత్నిస్తోందని శనివారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘పరిశ్రమల భూములు తాకట్టు’ అనే శీర్షికతో కథనం ప్రచురితమవడం తెలిసిందే. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)