Breaking News

3 జలాశయాల్లో పూడిక తీతకు పచ్చజెండా

Published on Thu, 12/26/2024 - 04:20

సాక్షి, హైదరాబాద్‌: కడెం, మిడ్‌మానేరు, లోయర్‌ మానేరు జలాశయాల్లో పైలట్‌ ప్రాజెక్టు కింద పూడిక తొలగింపునకు టెండర్లను ఆహ్వానించడానికి రా ష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిoది. ఇందులోని నిబంధనల మేరకు పూడిక తొలగింపుతో లభ్యమయ్యే ఇసుకను కాంట్రాక్టర్లు అమ్ముకోవచ్చు. ఈ నేపథ్యంలో మెట్రిక్‌ టన్ను ఇసుకకు రూ.406.64ను కనీస బిడ్డింగ్‌ ధరగా ప్రభుత్వం నిర్ధారించింది. 

ఈ ధరను ఎప్పటికప్పుడు సవరిస్తామని స్పష్టం చేసింది. కాంట్రాక్టర్లు తాము కోట్‌ చేసిన ధర ఆధారంగా ఎంత ఇసుకను తవ్వితే ఆ మేరకు ప్రభుత్వానికి చెల్లింపు లు చేయాల్సి ఉంటుంది. పూడిక తొలగింపు ద్వారా వచ్చే ఆదాయాన్ని తెలంగాణ వాటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీడబ్ల్యూఆర్‌డీసీ) ప్రత్యేక బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. కాంట్రాక్టర్లు ఇసుక నిల్వలను స్టాక్‌యార్డులో నిర్వహించాల్సి ఉంటుంది. 

నీటిపారుదల శాఖ, తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ)లు దీనిని పర్యవేక్షించనున్నాయి. ఈ మేరకు పూడిక తొలగింపునకు టెండర్లను ఆహ్వానించాలని కరీంనగర్‌ ఈఎన్‌సీని ఆదేశిస్తూ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.  

పేరుకుపోయిన పూడిక 
రాష్ట్రంలో మొత్తం 929 టీఎంసీల సామర్థ్యం కలిగిన 159 జలాశయాలున్నాయి. కాగా, ఇందులో సగానికి పైగా జలాశయాలు 25 ఏళ్లకు పైబడినవే కావడంతో పూడిక పెరిగి క్రమంగా నిల్వ సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి. తద్వారా ఆయకట్టుకు అవసరమై న సాగునీటికి లోటు ఏర్పడుతోంది. 

నేషనల్‌ హైడ్రాలజీ ప్రాజెక్టులో భా గంగా 220 టీఎంసీల సామర్థ్యం కలిగిన 14 ప్రాజెక్టులపై అధ్యయనం జరపగా, పూడికతో అవి 35 టీఎంసీల (16 శాతం) నిల్వ సామర్థ్యాన్ని కోల్పో యినట్టు తేలింది. 

దేశంలో పీఎం కిసాన్‌ సించాయ్‌ యోజన (పీఎంకేఎస్‌వై) మార్గదర్శకాల ప్రకారం ఒక టీఎంసీ సామర్థ్యం కలిగిన కొత్త జలాశయాన్ని నిర్మించాలంటే రూ.162 కోట్లు కావాల్సి ఉంటుంది. కాగా, పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన మూడు జలాశయాల్లో భారీగా పూడిక పేరుకుపోయింది. 

సర్కారుకు ఖర్చు లేకుండా.. 
జలాశయాల్లో పూడిక తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన జాతీయ విధానాన్ని తెలంగాణలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. పూడికతీత కోసం రాజస్తాన్, మహారాష్ట్రల తరహాలో ఆదాయ ఆర్జన విధానంలో భారీ యంత్రాలతో తవ్వకాలు (మెకానికల్‌ డ్రెడ్జింగ్‌) నిర్వ హించనున్నారు. దీనికోసం ప్రభు త్వం ఎలాంటి ఖ ర్చు చేయదు. 

అత్యధిక ధర కోట్‌ చేసిన బిడ్డర్లు పన్నులు, సెస్, జీఎస్టీ, రాయల్టీని చెల్లించి తవి్వన మట్టి, ఇసుకను విక్రయించుకోవచ్చు. పైలట్‌ ప్రాజెక్టు విజయవంతమైతే ఇతర జలాశయాల్లో సైతం పూడిక తొలగింపున కు ఇదే విధానాన్ని అనుసరించడానికి రాష్ట్ర ప్రభుత్వం తదుపరిగా అనుమతి ఇవ్వనుంది.  

పూడిక తొలగింపు గడువు 20 ఏళ్లు!  
జలాశయాల్లో భారీగా ఉన్న పూడికను ఇప్పటికిప్పుడు తొలగించడం సాధ్యం కాదు. పూడిక తొలగింపునకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్‌లు కాంట్రాక్టర్లతో 20 ఏళ్ల గడువుతో ఒప్పందా లు చేసుకోగా, మరో ఐదేళ్ల గడువు పొడిగింపునకు వెసులుబాటు కల్పించాయి. రాష్ట్రంలో సైతం ఇదే రీతిలో 20 ఏళ్ల గడువు విధించి, ఆ తర్వాత గరిష్టంగా 5 ఏళ్ల గడువు పొడిగింపునకు వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)