Breaking News

నేచర్‌ టు అడ్వెంచర్‌.. ఎకో టూరిజం

Published on Mon, 10/27/2025 - 03:19

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రకృతి, స్థానిక సంస్కృతి, పర్యావరణ పరిరక్షణలో భాగంగా పర్యాటక ప్రాంతాలను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. అడ్వెంచర్, రిక్రియేషన్, ఆధ్యాత్మిక, వారసత్వ, సినీ, వెడ్డింగ్, నేచర్‌ వైల్డ్‌లైఫ్, హెరిటేజ్‌ కల్చర్‌ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని 17 సర్క్యూట్లలో 64 ఎకో టూరిజం ప్రదేశాలను గుర్తించి వాటి అభివృద్ధికి చర్యలు చేపట్టనుంది. తద్వారా పర్యాటక ప్రాంతాల అభివృద్ధితోపాటు స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు కసరత్తు చేస్తోంది.

ఇప్పటికే జీవవైవిధ్య ప్రాంతాలు, ప్రాచీన వారసత్వ సంపదకు అద్దంపట్టే ప్రదేశాలను గుర్తించింది. మొదట అనంతగిరి, కనకగిరి, నందిపేట, మన్ననూరు పర్యాటక ప్రాంతాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించనుంది. ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వా మ్యంతో ఎకో టూరిజం ప్రాజెక్టులను సర్కారు అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగా అనంతగిరిలో 8, మన్ననూరులో 14 కాటేజీలను నిర్మించనుంది. ఒక్కో ఎకో కాటేజీ నిర్మాణానికి రూ. 20 లక్షలు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. ఎకో కాటేజీల నిర్మాణంతోపాటు ట్రెక్కింగ్‌ పార్క్, సఫారీ ట్రాక్, వాచ్‌ టవర్లను ఏర్పాటు చేయనున్నారు.

మన్ననూరులో ఇప్పటికే 130 మంది గైడ్‌లకు ఎకో టూరి జం హాస్పిటాలిటీపై శిక్షణ ఇచ్చారు. త్వరలోనే నిజామాబాద్‌జిల్లా నందిపేటలోని ఉమ్మెడ, గాజపల్లి, బిల స్పూర్‌లలో ఎకో టూరిజం పనులు ప్రారంభం కానున్నాయి. అలాగే వరంగల్‌ జూ పార్కును వర్చువల్‌ రియాలిటీ పార్కుగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు సిద్ధమైనట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. 

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)