అద్దె చెల్లించలేదని ప్రభుత్వ పాఠశాలకు తాళం

Published on Tue, 11/11/2025 - 08:11

సూర్యాపేట టౌన్‌: మూడేళ్లుగా అద్దె చెల్లించకపోవడంతో ప్రభుత్వ పాఠశాలకు తాళం వేసిన ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. సూర్యాపేట పట్టణంలోని తిలక్‌నగర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను అద్దె భవనంలో నడిపిస్తున్నారు. మూడేళ్లుగా భవనానికి అద్దె చెల్లించకపోవడంతో భవన యజమాని సోమవారం తాళం వేశారు. దీంతో ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు బయటనే నిరీక్షించాల్సి వచి్చంది. 

మూడేళ్ల కిరాయి ఇవ్వాల్సింది నిజమేనని పాఠశాల ఉపాధ్యాయులు చెబుతున్నారు. భవన యజమాని ఏడాది ప్రారంభంలోనే కిరాయి బకాయిల గురించి అధికారులకు తెలియజేసినట్టు చెబుతున్నాడు. ఈ సంవత్సరానికి సంబంధించిన ఆరు నెలల కిరాయి మాత్రమే మంజూరైనట్లు అధికారులు చెప్తున్నారు. స్కూల్‌ గేటుకు తాళం వేసిన నేపథ్యంలో అధికారులు విద్యార్థులను సమీపంలోని హైస్కూల్‌కు తరలించారు. బకాయిల సమస్యను త్వరగా పరిష్కరించి, పాఠశాల నిర్వహణకు శాశ్వత ఏర్పాట్లు చేయాలని తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)