వైద్య కాలేజీల్లో 607 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి

Published on Thu, 07/11/2024 - 04:24

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ వైద్య విద్యా సంస్థల్లో ఉద్యోగ ఖాళీల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేలోపు కీలక కేడర్‌లలో ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖను ఆదేశించింది. ఈ మేరకు 36(8 కొత్త మెడికల్‌ కాలేజీలతో కలిపి) ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లోని 607 ఖాళీల భర్తీకి అనుమతి ఇచ్చి0ది. మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. 

మొత్తం 34 డిపార్ట్‌మెంట్లలో ఈ ఖాళీలు ఉన్నాయి. అత్యధికంగా గైనకాలజీ విభాగంలో 90 పోస్టులు ఉండగా, జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీలో కలిపి 85 పోస్టులకుపైగా ఉన్నాయి. మిగిలిన డిపార్ట్‌మెంట్లలో పరిమిత సంఖ్యలో పోస్టులున్నాయి. అకాడమిక్‌ క్వాలిఫికేషన్‌లో వచ్చిన మార్కులు, కాంట్రాక్ట్‌ సర్వీస్‌ వెయిటేజీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ వస్తుందని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. 

435 ఎంబీబీఎస్‌ డాక్టర్‌ పోస్టులకు 2,400 దరఖాస్తులు
ప్రభుత్వ దవాఖాన్లలోని 435 ఎంబీబీఎస్‌ (సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌) డాక్టర్‌ పోస్టుల భర్తీకి ఇటీవల మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల 11వ తేదీ సాయంత్రానికి అప్లికేషన్ల గడువు ముగియనుంది. బుధవారం నాటికి సుమారు 2400 మంది డాక్టర్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 

ఇంకో వెయ్యి దరఖాస్తులు వరకూ వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది ఒక్కో పోస్టుకు ఐదుగురు డాక్టర్లు దరఖాస్తు చేయగా, ఈసారి ఒక్కో పోస్టుకు 7 నుంచి 8 అప్లికేషన్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రైవేటు ప్రాక్టీస్‌పై బ్యాన్‌ పెట్టినప్పటికీ, ప్రభుత్వ సర్వీసులోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తుండడం గమనార్హం. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)