Breaking News

మహిళల నైపుణ్యం అద్భుతం 

Published on Sat, 02/25/2023 - 03:07

ఖైరతాబాద్‌: చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు దేశానికి వెన్నెముకలాంటివని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. శుక్రవారం అసోసియేషన్‌ ఆఫ్‌ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎలిప్‌) ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజాలో ఏర్పాటుచేసిన ‘ఎలిప్‌ వికార్డ్‌’ ఎగ్జిబిషన్‌ను గవర్నర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె స్టాళ్లలో అమ్మకానికి ఉంచిన ఉత్పత్తులను పరిశీలించి, మహిళలతో మాట్లాడారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, వారు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొని ముందుకు సాగుతారన్నారు. మహిళలు ఎంతో నైపుణ్యంతో తయారు చేసిన ఉత్పత్తులను ఒక్కచోటకు చేర్చి ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ ఉత్పత్తులన్నీ అద్భుతంగా ఉన్నాయన్నారు. ఎంఎస్‌ఎంఈకి అన్నివేళలా అండగా ఉంటామని, కోవిడ్‌ సమయంలోనూ ఎంఎస్‌ఎంఈ రుణాలను చెల్లించడం అభినందనీయమన్నారు.

కార్యక్రమంలో ఎలిప్‌ ఉపాధ్యక్షురాలు దుర్గాభవాని, కార్యదర్శి వి.శ్రీదేవి, సహాయ కార్యదర్శి పల్లవి జోషి, కోషాధికారి మహాలక్ష్మి, ఎగ్జిబిషన్‌ చైర్‌పర్సన్‌ శైలజ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రదర్శన ఈ నెల 26 వరకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.  

Videos

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)