క్రీస్తు బోధనలకు ప్రతీక మెదక్‌ చర్చి

Published on Mon, 12/23/2024 - 03:07

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/ మెదక్‌ జోన్‌/చిలిప్‌చేడ్‌: మెదక్‌ చర్చి యేసు క్రీస్తుకు ప్రతీకగా నిలుస్తూ, ఆయన బోధనలకు జీవమిస్తోందని రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ కొనియాడారు. వందేళ్ల విశ్వాసానికి, దేవుని కృపకు ఈ ఆలయం నిదర్శనమని, శాంతిని కోరుకునే వారికి మార్గ నిర్దేశాన్నిస్తుందని పేర్కొన్నారు. ఆదివారం ఆయన మెదక్‌ జిల్లాలో పర్యటించారు. చర్చ్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా (సీఎస్‌ఐ) సంఘ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు.

గవర్నర్‌ రాక పురస్కరించుకుని ప్రెసిబెటరి ఇన్‌చార్జి శాంతయ్య ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. మెదక్‌ చర్చి శతాబ్ది ఉత్స­వాలు కేవలం వందేళ్ల సంబరమే కాదని, మానవ విశ్వాసం, దేవుని అమోఘమైన కృపకు నిదర్శనంగా నిలిచే ఒక మహత్తర ఘట్టమని అభివర్ణిం చారు. 

ఈ సందర్భంగా బైబిల్‌లోని.. ‘ఎక్కడ ఇద్దరు లేదా ముగ్గురు నా నామమున కూడి ఉంటారో.. అక్కడ నేను ఉంటాను..’అనే క్రీస్తు వచనాలను గవర్నర్‌ ఉటంకించారు. ఈ చర్చి శతాబ్దంగా దైవ సాన్నిధ్యానికి కేంద్రంగా నిలిచిందని, ఒక విశ్వాసాన్ని పెంపొందించిన స్థలం గానే కాకుండా, అనేకమంది జీవితాలను మార్చిన ప్రదేశంగా నిలిచిందని చెప్పారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఇంతటి గొప్ప దేవాలయాన్ని మనకు ఇచి్చనందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని గవర్నర్‌ చెప్పారు.  

విద్యార్థులు కలలు సాకారం చేసుకోవాలి 
విద్యార్థులు దేశ భవిష్యత్తుకు పునాది లాంటి వారని, వారు సమస్యలను అధిగమిస్తూ లక్ష్యాలను సాధించాలని, కలలు సాకారం చేసుకోవాలని గవర్నర్‌ సూ­చించారు. విద్యాలయాలు దేవాలయాలతో సమానమని, విద్యార్థులు చిన్నతనం నుంచే క్రమశిక్షణతో మంచి నాగరికతను పుణికి పుచ్చుకొని భవిష్యత్తుకు మార్గ నిర్దేశనం చేసుకోవాలని కోరారు. 

కొల్చారంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో జిష్ణుదేవ్‌ వర్మ పాల్గొన్నారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. తనకు బ్యాడ్మింటన్‌ క్రీడ అంటే ఇష్టమని, మాజీ ఉప రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ తనకు ఆదర్శమని తెలిపారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. 

ఈ కార్యక్రమంలో మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, మైనంపల్లి రోహిత్‌రావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, గవర్నర్‌ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, కలెక్టర్‌ రాహుల్‌ రాజ్, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, గురుకుల పాఠశాలల కార్యదర్శి అలుగు వర్షిణి తదితరులు పాల్గొన్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)