Breaking News

చిత్తశుద్ధి, దూరదృష్టితోనే అభివృద్ధి

Published on Sat, 10/26/2024 - 05:06

సాక్షిప్రతినిధి, ఖమ్మం: నిధులు ఉన్నంత మాత్రాన అభివృద్ధి జరగదని.. దూరదృష్టి, చిత్తశుద్ధితోనే అర్హులందరికీ అభివృద్ధి ఫలాలు దక్కుతాయని రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ పేర్కొన్నారు. శుక్రవా రం ఉదయం ఆయన భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆల య పండితులు ఆయనకు పరివట్టం కట్టి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అంతరాలయంలో మూలమూర్తుల దర్శనం తర్వాత అర్చకులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ ఈఓ రమా దేవి స్వామి వారి జ్ఞాపిక, ప్రసాదాలు అందచేశారు.

తర్వాత రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో భద్రాచలంలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తలసేమియా, సికిల్‌సెల్‌ ప్రత్యేక వార్డులను గవర్నర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీలో గిరిజనులకు రెడ్‌క్రాస్‌ సంస్థ ద్వారా అమూల్యమైన సేవలు అందటం అభినందనీయమని అన్నారు. భద్రాచలంలోని ఏరియా ఆస్పత్రిని కేంద్రం నిధులతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చే ప్రతిపాదనలను పరిశీలిస్తామని వెల్లడించారు.  

కలెక్టరేట్లలో భేటీలు: ఈ పర్యటనలో గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ కొత్తగూడెం కలెక్టరేట్, ఖమ్మం కలెక్టరేట్ల లో అధికారులతో పాటు వివిధ రంగాల్లోని ప్రముఖులతో భేటీ అయ్యారు. అలాగే, శాఖల వారీగా ఏర్పాటుచేసిన స్టాళ్లను పరిశీలించారు. ఈ సమావేశాల్లో గవర్నర్‌ మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలలో నివసిస్తున్న నిరుపేద, గిరిజనులకు అభివృద్ధి ఫలాలు అందించి వారు మెరుగైన జీవితం గడి పేలా అధికార యంత్రాంగం కృషి చేయాలని సూచించా రు. 

భద్రాద్రి జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుతీరు బాగుందని అభినందించారు. ఖమ్మంలో గవర్నర్‌ మాట్లాడుతూ పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య మాదిరిగా తాను సైతం పర్యావరణ వేత్తగా కెరీర్‌ను ప్రారంభించానని, ప్రకృతి దైవంతో సమానమనే భావన అందరిలో ఉండా లని అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీలు బలరాంనాయక్, రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే లు వెంకట్రావు, కూనంనేని సాంబశివరావు, రెండు జిల్లాల కలెక్టర్లు జితేశ్‌ వి.పాటిల్, ముజమ్మిల్‌ ఖాన్, ఎస్పీ రోహిత్‌రాజ్, సీపీ సునీల్‌దత్, ఐటీడీఏ పీఓ రాహుల్, గవర్నర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పాల్గొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)