Breaking News

ప్రజారోగ్య డైరెక్టర్‌పై విచారణ

Published on Sun, 03/30/2025 - 02:09

సాక్షి, హైదరాబాద్‌: వైద్య, ఆరోగ్యశాఖలో కీలకమైన ప్రజారోగ్య సంచాలకుడు (డీహెచ్‌) డాక్టర్‌ రవీందర్‌ నాయక్‌తోపాటు ఆరుగురు ఉద్యోగులపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. సీనియారిటీ జాబితాలో మొదటి వరుసలో ఉన్న ఆయనను కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత డీహెచ్‌గా నియమించింది. ఆయన హయాంలో ఉద్యోగుల డిçప్యుటేషన్లు, బదిలీలలో అనేక అక్రమాలు జరిగాయని, డిప్యుటేషన్లు లేవంటూనే జోన్లు, క్యాడర్‌ పోస్టులతో సంబంధం లేకుండా ఉద్యోగులను బదిలీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. 

ఈ నేపథ్యంలో గతంలోనే మెమో ఇచ్చి విజిలెన్స్‌ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం.. తాజాగా పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల కమిషనర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ను ఆదేశించింది. ఆయనతో పాటు డీహెచ్‌ కార్యాలయంలో పనిచేసే మరో ఆరుగురిపై కూడా విచారణకు ఆదేశిస్తూ 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  

అవినీతి ఆరోపణలు, అక్రమ డిప్యుటేషన్లు 
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో పారామెడికల్‌ బోర్డు కార్యదర్శిగా కీలక హోదాలో రవీందర్‌ నాయక్‌ పనిచేశారు. ఆ సమయంలో పారా మెడికల్‌ బోర్డులో అక్రమాలు, అవినీతి చోటుచేసుకున్నట్లు ఫిర్యాదు లు రావడంతో పలువురు అధికారులను బదిలీ చే శారు. రవీందర్‌ నాయక్‌ను కూడా ఆ హోదా నుంచి తప్పించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వా త ఆరోగ్యశాఖకు డైరెక్టర్‌గా ఇన్‌చార్జి హోదాలో ఆయన వచ్చారు. 

గతేడాది ఆరోగ్యశాఖలో జరిగిన సాధారణ బదిలీల్లో డీహెచ్‌ ఆఫీస్‌ వేదికగా అక్ర మాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. డీహెచ్‌ కార్యాలయంలోనే కీలక పోస్టుల్లో పనిచేసిన మరో ఆరుగురు ఉద్యోగులకు ఈ అక్రమాల్లో పాత్ర ఉన్న ట్లు ఆరోపణలు వచ్చాయి. వీరిలో ఇద్దరు అధికారులు అర్హత లేకున్నా డిప్యుటేషన్లపై డీహెచ్‌ కార్యా లయానికి వచ్చినట్లు తెలిసింది. 

ఈ పరిణామాలపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గత సంవత్సరం విజిలెన్స్‌ విచారణకు ఆదేశించారు. విజిలెన్స్‌ నివేదిక అనంతరం గత నవంబర్‌లో డీహెచ్‌తో పాటు మరో ఆరుగురికి చార్జి మెమోలు జారీ చేశారు. మెమోలకు వారిచి్చన వివరణలను పరిశీలించిన సర్కారు సంతృప్తి చెందకపోవడంతో మొత్తం వ్యవహారంపై విచారణకు ఆదేశించింది.  

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)