Breaking News

గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో గెస్ట్‌ లెక్చరర్ల నియామకానికి గ్రీన్‌ సిగ్నల్‌

Published on Wed, 07/19/2023 - 09:14

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 1,654 మంది అతిథి అధ్యాపకుల(గెస్ట్‌ లెక్చరర్లు) నియామకానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు ఇంటర్మీడియెట్‌ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. నియామక మార్గదర్శకాలను విడుదల చేశారు. 

కాగా, ప్రభుత్వం అతిథి అధ్యాపకులకు ఒక్కో పీరియడ్‌ నిమిత్తం రూ.390 చెల్లిస్తుంది. నెలకు 72 పీరియడ్లకు మాత్రమే అనుమతిస్తుంది. దీంతో వారికి రూ.28,080 చొప్పున వేతనం అందుతుంది. జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో జిల్లా ఇంటర్‌ విద్యా శాఖ అధికారి, ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లు సభ్యులుగా నియామక కమిటీని ఏర్పాటుచేస్తారు. జిల్లాల్లో కాలేజీలవారీగా ఖాళీలను ఈ నెల 19న వెల్లడిస్తారు. 24లోగా అన్ని అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తు చేసు కోవాలి. 

ఇక, 26వ తేదీన దరఖాస్తులను పరిశీలించి మెరిట్‌ అభ్యర్థుల జాబితా రూపొందిస్తారు. జిల్లా కలెక్టర్‌ 28న ఎంపికైన గెస్ట్‌ లెక్చరర్ల జాబితా వెల్లడిస్తారు. నియమించిన అతిథి అధ్యాపకులు వచ్చే నెల 1న సంబంధిత కాలే జీల ప్రిన్సి పాళ్లకు రిపోర్టు చేయాలి. గతంలో పనిచేసిన అతిథి అధ్యాపకులను తిరిగి కొన సాగించకపోవడంతో వారిలో ఆందోళన నెల కొంది. అయితే కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా కొత్త నియామక ప్రక్రియ అనివార్యమైందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. 

ఇది కూడా చదవండి: ఆగస్టు 1న మహారాష్ట్రకు కేసీఆర్‌

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)