Breaking News

నాటువైద్యులున్నారా?.. గుర్రపు బగ్గీలున్నాయా?

Published on Sat, 07/18/2026 - 04:30

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : మీ ఊర్లో నాటువైద్యులున్నారా? ప్రకృతి చికిత్సలు చేస్తున్నారా? రిక్షా వాలాలున్నారా? రోజూ న్యూస్‌పేపర్‌ వస్తుందా? రోజు వారి వడ్డీకి అప్పులిచ్చే వారు ఎంత మంది ఉన్నారు? పశువులు మేసేందుకు ప్రత్యేకంగా గడ్డి భూములున్నాయా? మీ ఊరు శివార్లలో వాటర్‌ ఫాల్‌ ఉందా..? ఇవేం ప్రశ్నలు అనుకుంటున్నారా..? జనగణన (సెన్సస్‌)లో భాగంగా ఇప్పటి వరకు హౌస్‌ లిస్టింగ్‌ ఆపరేషన్‌ (ఇండ్ల గణన) చేసిన ప్రభుత్వం., ఇప్పుడు విలేజ్‌ డైరెక్టరీ (గ్రామ సమాచార దర్శని) రూపొందిస్తోంది. ఆయా గ్రామానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

అలాగే పట్టణాలు, నగరాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించి టౌన్‌ డైరెక్టరీ, సిటీ డైరెక్టరీలను తయారు చేయనున్నారు. ఆగస్టు 10 తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ సెప్టెంబర్‌ 9 వరకు నెల రోజుల పాటు కొనసాగుతుంది. సాధారణ గ్రామమా? కొండ ప్రాంతమా? మంచు కురిసే ప్రాంతంలో గ్రామం ఉందా? ఎడారి, అటవీ, తీర ప్రాంతంలో ఉందా? వంటి వివరాలు సైతం నమోదు చేస్తారు. అలాగే ఆ గ్రామం జిల్లా కేంద్రానికి, పట్టణానికి, మండల కేంద్రానికి ఎంత దూరం ఉంది? హామ్లేట్‌ గ్రామాలెన్ని ఉన్నాయి? అనే వివరాలను కూడా సేకరిస్తారు.  

తొమ్మిది రకాల సదుపాయాల వివరాలు నమోదు 
» ప్రీప్రైమరీ నుంచి సీనియర్‌ సెకండరీ పాఠశాలలు, ఒకేషనల్, ట్రైనింగ్‌ సెంటర్లు, కాలేజీ ఆర్ట్, కామర్స్, నర్సింగ్, మెడికల్, ఓపెన్‌ లెర్నింగ్‌ సెంటర్లు వంటివి ఉంటే వాటి వివరాలు నమోదు చేస్తారు. ఇవి ప్రభుత్వానివా? ప్రైవేటువా? అని పేర్కొంటారు. ఒకవేళ ఇవి గ్రామంలో లేకపోతే ఎంత దూరంలో ఈ సంస్థలున్నాయనే వివరాలు సేకరిస్తారు. 

» సబ్‌ సెంటర్లు, పీహెచ్‌సీ, సీహెచ్‌సీలు, ప్రైవేటు ఆస్పత్రులున్నాయా? నాటువైద్యులు, ప్రకృతి వైద్యం చేసే వారు, విద్యార్హతలు ఉండి వైద్యం చేసే వారు, లేకుండా వైద్యం చేసే కేంద్రాల వంటి సమాచారాన్ని సేకరిస్తారు. ఒకవేళ ఇవి లేకపోతే ఎంత దూరంలో వెళ్లి ఈ వైద్యం చేయించుకుంటున్నారు. గ్రామంలో మెడికల్‌ షాపులు ఎన్ని ఉన్నాయి? అనే వివరాలు నమోదు చేస్తారు. 

»శుద్ధి చేసిన/చేయని తాగునీరు, బావులు, బోరుబావులు.. ఇలా తాగునీటి సరఫరా సమాచారాన్ని క్రోడీకరిస్తారు. ఇవి నిరంతరం నీటి సరఫరా చేస్తున్నాయా? కొన్ని సీజన్లకే పరిమితమవుతున్నాయా? డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించి ఓపెన్, యూజీడీ, ఎస్టీపీ ప్లాంట్లు, కమ్యూనిటీ టాయిలెట్లు తదితర వివరాలను నమోదు చేస్తారు. 

» రవాణా, కమ్యూనికేషన్‌ పరంగా పోస్టాఫీసు, టెలిఫోన్‌లైన్, మొబైల్‌ నెట్‌వర్క్, పబ్లిక్‌ బస్సు సౌకర్యం, రైల్వేస్టేషన్, రిక్షావాలాలు, మనుషులను తరలించే గుర్రపు బగ్గీలు/ఎడ్లబండ్లు, వాగులు, నదులు దాటించే పుట్టిలు ఇతర రవాణా సదుపాయాల సమాచారం తెలుసుకుంటారు. ఫుట్‌ పాత్‌ల నుంచి మొదలు నేషనల్‌ హైవేల వరకు గ్రామాల్లో రోడ్ల వివరాలు తీసుకుంటారు. గృహ, వ్యవసాయ, వాణిజ్య విద్యుత్‌ సౌకర్యం వివరాలు తీసుకుంటున్నారు.  

» ఏటీఎంలు, బ్యాంకులు, రోజు వారీ వడ్డీ వ్యాపా రులు, ఎస్‌హెచ్‌జీలు, అగ్రికల్చర్‌ సొసైటీలు, డెయిలీ న్యూస్‌ పేపర్‌ సప్లయ్, రేషన్‌షాపులు, సంతలు, స్ట్రీట్‌ లైట్‌లు, గ్రేవ్‌యార్డులు ఇలాంటి 28 రకాల వివరాలు నమోదు చేస్తారు. 

» గ్రామ భౌగోళిక విస్తీర్ణం, అటవీ భూములు, వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విస్తీర్ణాలు, పశువులు మేసేందుకు ప్రత్యేకంగా గడ్డి భూములు, శాశ్వత/తాత్కాలిక బీడు భూములు, కాలువలు, బోర్లు, చెరువులు, జలపాతాల వంటి భౌగోళిక అంశాలను క్రోడీకరిస్తారు. 

» వ్యవసాయ ఉత్పత్తులు, అనుబంధ వస్తువుల త యారీ, ఫ్యాక్టరీలు, అందులో తయారయ్యే వివరాలు, చేతి వృత్తులు, వివిధ తయారీ ఉత్పత్తులు వీటితో పాటు దృష్టికి వచ్చిన వాటి వివరాలను కూడా ప్రత్యేకంగా నమోదు చేస్తారు. 

ప్రత్యేక యాప్‌లో నమోదు 
ఈ వివరాలన్నింటినీ సెన్సస్‌కు సంబంధించిన డీసీహెచ్‌బీ(డిస్ట్రిక్ట్ సెన్సెస్‌ హ్యాండ్‌బుక్‌) యాప్‌లో నమోదు చేయనున్నారు. ఈ బాధ్యతలను గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, జీపీలకు, పట్టణాల్లో వార్డు ఆఫీసర్లకు కేటాయించారు. నగరాల్లో ఆయా నగర పాలక సంస్థల సిబ్బంది ఈ వివరాలను సేకరిస్తారు. వీరు ఈ ప్రక్రియలో ఫీల్డ్‌ ఫంక్షనరీలు (క్షేత్రస్థాయిలో నేరుగా ప్రజలతో లబ్దిదారులతో కలిసి పనిచేసే సిబ్బంది లేదా అధికారులు)గా వ్యవహరించనున్నారు. సేకరించిన వివరాలతో జిల్లాలో ఉన్న అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలు, నగరాలతో కూడిన జిల్లా, రాష్ట్ర డైరెక్టరీలను రూపొందిస్తామని అధికారులు తెలిపారు.  

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)