Breaking News

TG: ‘ముందు మాట’ వివాదం.. ఇద్దరు అధికారులపై వేటు

Published on Fri, 06/14/2024 - 18:04

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు పాఠ్యపుస్తకాల్లో తప్పిదాలపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలుగు టెక్ట్స్ బుక్స్‌లో వచ్చిన తప్పులను సీరియస్‌గా తీసుకున్న సర్కార్‌.. ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విభాగం డైరెక్టర్‌ శ్రీనివాసచారి, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ రాధారెడ్డిపై చర్యలకు ఆదేశించింది. పాఠ్యపుస్తకాల బాధ్యతల నుంచి శ్రీనివాసచారి, రాధారెడ్డిని తొలగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌గా పాఠశాల విద్య అదనపు డైరెక్టర్‌ రమేశ్‌కు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ గురుకుల సొసైటీ  రమణ కుమార్‌కి ముద్రణ సేవల విభాగం డైరెక్టర్‌గా బాధ్యతలు కేటాయించారు.

ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు అధికారులు పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్‌లు పంపిణీ చేశారు. అయితే, విద్యాశాఖ వీటిలో ముందుమాట మార్చకుండా ముద్రించింది. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందిస్తున్నామన్న ఉత్సాహంతో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి పేర్లతో పాఠ్య పుస్తకాల్లో ముద్రించి పంపిణీ చేశారు. కాగా, కొత్తగా వచ్చిన పుస్తకాలు అన్నింటినీ వెరిఫికేషన్ చేయగా విద్యార్థులకు పంపిణీ చేసిన అన్ని తరగతుల తెలుగు పుస్తకాల్లోని ముందు మాట పేజీలో తప్పులు ఉండటంతో ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.

పాఠ్యపుస్తకాల్లో మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, కడియం శ్రీహరి, సంచాలకులు జగదీశ్వర్ పేర్లు ఉన్నాయి. దీంతో, అలర్ట్‌ అయిన విద్యాశాఖ విద్యార్థులకు పంపిణీ చేసిన పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ముందు మాటను మార్చి విద్యార్థులకు తిరిగి ఇవ్వనున్నారు.

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)