Breaking News

గూగుల్‌ మ్యాప్‌ను నమ్ముకుని గుంతలో పడ్డారు..

Published on Mon, 09/08/2025 - 07:31

జనగామ: గూగుల్‌ మ్యాప్‌ వలస కూలీల ప్రాణాల మీదకు తెచ్చింది. మ్యాప్‌నే నమ్ముకుని డ్రైవింగ్‌ చేసిన డ్రైవర్‌ ప్రయాణికుల ప్రాణాలు తీసినంత పనిచేశాడు. ఈ సంఘటన జనగామ జిల్లా కేంద్రంలోని సిద్దిపేట ప్రధాన రహదారి శామీర్‌పేట బైపాస్‌ వద్ద ఆదివారం తెల్లవారు జామున జరిగింది. ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏలూరు జిల్లా కైలూరు మండలానికి చెందిన డ్రైవర్‌తో సహా 19 మంది మత్స్య కార్మికులు తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాకు బొలెరో వాహనంలో బయలుదేరారు. సంగారెడ్డి ప్రాంతంలో చెరువుల్లో చేపలు పట్టి, వాహనంలో లోడ్‌ చేసేందుకు రోజుకు రూ.1,000 వేతనం ఒప్పందంతో ఇక్కడకు వస్తు న్నారు. 

కైలూరు నుంచి బయలుదేరే సమయంలో డ్రైవర్‌ గూగుల్‌ మ్యాప్‌ను మాత్రమే నమ్ముకున్నాడు. జనగామ మండలం శామీర్‌పేట బైపాస్‌ వద్ద మలుపు తిరిగే సమయంలో రెండువైపులా గుంతల రూపంలో ప్రమాదం పొంచి ఉంది. ఇక్కడ ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడం, గూగుల్‌ మ్యాప్‌ స్ట్రైట్‌ రూట్‌ చూపించడంతో డ్రైవర్‌ నేరుగా వచ్చే శాడు. దగ్గరకు వచ్చేసరికి మలుపు, పక్కనే గుంత కనిపించడంతో వేగంగా ఉన్న వాహనాన్ని అదుపు చేసే క్రమంలో బొలెరో వాహనం అందులో పల్టీ కొట్టింది. గాఢనిద్రలో ఉన్న కూలీలు బాలి మాణిక్యం, సైదు వెంకటనారాయణ, గంటసాల రాధాకృష్ణ, బాలె హరినాథ్, గంటసాల వెంకన్న, ఇమ్మాన్యు యేల్, బాలె రవికుమార్, గంటసాల రేణుక, గంటసాల సాయి, ముంగర సత్యనారా యణ, కె.ఏసోబు, సైదు హరిశ్చంద్ర, నడుగారి ఆదేశ్, నబిగర్‌ నాగరాజు, సైదు వెంకటనారాయణ, ఏదూరి నల్లయ్య, బాలె మాణిక్యం, బాలె రవికుమార్, బాలె మణికంఠకు తీవ్ర గాయాలయ్యాయి.

వెంటనే స్థానికులు స్పందించి అంబులెన్స్‌కు సమాచారం అందించగా, క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. ఇందులో హరిశ్చంద్ర, సత్యనారాయణ తల, శరీర భాగాలకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితికి చేరుకోవడంతో ప్రాథమిక చికిత్స అందించి 108లో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మిగతా కూలీలకు ఇక్కడే వైద్య పరీక్షలు అందిస్తున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)