Breaking News

త్వరలో హోంగార్డులకు శుభవార్త

Published on Sun, 12/07/2025 - 03:21

సాక్షి, హైదరాబాద్‌: నూతన హోంగార్డుల నియామకాల ప్రతిపాదన, వారికి రాజీవ్‌ ఆరోగ్యశ్రీ వైద్య సౌక ర్యం, అర్హులైన వారికి డబుల్‌ బెడ్రూం ఇళ్ల కేటా యింపు వంటి అంశాలు తమ పరిశీలనలో ఉన్నా యని డీజీపీ బి.శివధర్‌రెడ్డి అన్నారు. హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న హోంగార్డులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. హోంగార్డులు తమ సమస్యలను తనకు నేరుగా తెలియజేసేందుకు వీలుగా పోలీసు అధికారులు వారితో మాట్లాడి ఆయా అంశాలను క్రోడీకరించి తన కార్యాలయానికి పంపాలని యూనిట్‌ అధికారులను ఆదేశించారు. 

డీజీపీ కార్యాలయంలో పని చేస్తున్న హోంగార్డులతో ఈ సందర్భంగా తన కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సీనియర్‌ హోంగార్డులతో కేక్‌ కట్‌ చేయించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, రాష్ట్ర పోలీస్‌ శాఖలో హోంగార్డులు ప్రధాన పాత్రను పోషిస్తున్నారని, పెద్దగా ప్రతిఫలం ఆశించకుండా వారు కీలక సేవలందిస్తున్నారని కొనియాడారు. తాను ఉద్యోగంలో చేరినప్పటితో పోలిస్తే ప్రస్తుతం హోంగార్డుల పరిస్థితి మెరుగ్గా ఉందని, పోలీస్‌ శాఖకు వారు వెన్నెముకగా ఉన్నారని ప్రశంసించారు. 

హోంగార్డులకు సంబంధించిన కొన్ని విషయాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని, కారుణ్య నియామకాలకు సంబంధించిన అంశం త్వరలో పరిష్కరించాల్సి ఉందన్నారు. హోంగార్డులకు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ చేసేందుకు కొన్ని బ్యాంకులు ముందుకు వస్తున్నాయని, ఆయా బ్యాంకు అధికారులతో తాను ఇప్పటికే చర్చించానని పేర్కొన్నారు. ప్రభుత్వ పరిశీలనలో ఉన్న అంశాలలో హోంగార్డులు త్వరలో శుభవార్తను వింటారని ఆశిస్తున్నానని శివధర్‌రెడ్డి అన్నారు. 

హోంగార్డ్స్‌ అడిషనల్‌ డీజీ స్వాతి లక్రా మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇప్పటికే హోంగార్డులకు వివిధ సంక్షేమ పథకాలను అమలుచేస్తోందని తెలిపారు. 15,075 రెయిన్‌ కోట్స్, 4,700 ఉలెన్‌ జాకెట్స్‌ ఇటీవల హోంగార్డులకు అందజేశామని చెప్పారు. కార్యక్రమంలో శాంతి భద్రతల అడిషనల్‌ డీజీ మహేశ్‌ భగవత్, సీఐడీ అడిషనల్‌ డీజీ చారుసిన్హా, ఐజీలు చంద్రశేఖర్‌రెడ్డి, డాక్టర్‌ ఎం.రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)