Breaking News

రామోజీ ఫిలిం సిటీ ఆక్రమణల పర్వం: గోనె ప్రకాశరావు

Published on Fri, 01/05/2024 - 11:37

సాక్షి, ఢిల్లీ: ఈనాడు అధినేత రామోజీరావు ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్‌ రావు సంచలన ప్రకటన చేశారు. ఫిలిం సిటీ ప్రాంతంలో గాలిబ్‌ జంగ్‌ రాజవంశానికి చెందిన 1700 ఎకరాల భూమిని రామోజీరావు ఆక్రమించుకున్నారని ప్రకాశ్‌ రావు ఆరోపించారు. 

కాగా, మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్‌ రావు తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘రామోజీ ఫిలిం సిటీలో ప్రభుత్వ భూములున్నాయి. రామోజీరావు  ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారు. ఫిలిం సిటీలో రాజ వంశీకుల భూములు, అసైన్డ్, రహదారి భూములు ఉన్నాయి. గాలిబ్ జంగ్ రాజ వంశానికి సంబంధించిన 1700 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారు. అనాజ్‌పూర్-ఇబ్రహీంపట్నం  ప్రజా రహదారిని కూడా ఆక్రమించారు. ఈ విషయంలో ప్రజలు ఎన్ని ఆందోళనలు చేసినా పట్టించుకోలేదు. 

ఇప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈ ఆక్రమణలపై దృష్టి పెట్టాలి. రాజుల వంశంలోని నాటి మైనర్లకు సంబంధించిన భూములు అవి. మైనర్లు కావడం వల్ల ఆ భూములు కోర్టు ఆఫ్‌ వార్డ్స్‌ ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. కానీ, ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తులు ఆ భూములన్నింటినీ ఆక్రమించుకున్నారు. రాష్ట్రంలో పత్రికాధిపతి చేతిలో ఈ భూములు ఉన్నాయి. అలాగే ఓ రియల్టర్‌, పారిశ్రామికవేత్త కూడా ఈ భూములను ఆక్రమించారు. ఈ అంశాలపై చర్యలు తీసుకోవాలని త్వరలోనే సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గేను కూడా కలుస్తాను. ఈ భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలి’ అని అన్నారు. 
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)