Breaking News

చితి మంటలు ఆర్పేసి బూడిద ఎత్తుకెళ్లిన దుండగులు

Published on Sun, 07/26/2026 - 10:49

జగిత్యాల జిల్లా: మల్యాల మండల కేంద్రంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. బంగారు గుండు కోసం చితి మంటలు పూర్తిగా ఆరిపోకముందే ఇద్దరు దుండగులు నీళ్లు చల్లి బూడిదను సంచుల్లో నింపి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. శుక్రవారం సాయంత్రం ఓ మహిళ అంత్యక్రియలు ముగిసిన అనంతరం కుటుంబ సభ్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత శ్మశానానికి చేరుకున్న దుండగులు మహిళ తల భాగంపై నీరు పోసి మంటలు ఆర్పి బూడిదను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు వారిని వెంబడించడంతో దుండగులు బూడిద సంచులను వదిలేసి పరారైనట్లు సమాచారం.

స్థానికుల కథనం ప్రకారం, మహిళలు మృతిచెందినప్పుడు సంప్రదాయం ప్రకారం వారు ధరించే నల్లపూసల ఆభరణంలోని చిన్న బంగారు గుండును మృతురాలి నోట్లో ఉంచి అనంతరం దహన సంస్కారాలు నిర్వహిస్తారు. ఈ ఆనవాయితీని ఆసరాగా చేసుకుని దాదాపు రూ.10 వేల విలువైన ఆ బంగారు గుండు కోసం దుండగులు చితి బూడిదను వెదుకుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)