Breaking News

భద్రాచలం వద్ద మళ్లీ రెండో ప్రమాద హెచ్చరిక

Published on Sat, 07/27/2024 - 05:20

భద్రాచలం/ధరూరు: భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం పెరగడంతో శుక్రవారం రాత్రికి మళ్లీ రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరింది. గోదావరికి ఎగువన ఉన్న మహా రాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండడంతో పాటు కాళేశ్వరం,  సమ్మక్క బ్యారేజీ వద్ద నుంచి పెరిగిన వరద గోదావరికి చేరుతుండగా నీటిమట్టం తగ్గినట్టే తగ్గి పెరుగుతోంది. గురు వారం రాత్రి 11 గంటలకు 48.10 అడుగుల నీటిమట్టం ఉండగా.. శుక్రవారం ఉదయం 8గంటలకల్లా తగ్గి 46.90 అడు గులకు చేరింది.

దీంతో రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. కానీ ఆతర్వాత పెరుగుతూ రాత్రి 9:15 గంటలకు నీటిమట్టం 48 అడుగులకు చేరింది. దీంతో మళ్లీ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాగా, వరదతో ముంపు గ్రామాల రైతులు పంట కాలం ఆలస్యమవుతుందని ఆందోళన చెందుతుండగా.. రహదా రుల పైకి నీరుచేరి ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు రవాణా స్తంభించింది. 

నిలకడగా జూరాల
జూరాల ప్రాజెక్టులో వరద నిలకడగా కొనసాగుతోంది. శుక్రవా రం రాత్రి 10 గంటలకు ప్రాజెక్టుకు 2,65,000 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 36 క్రస్టు గేట్లు ఎత్తి స్పిల్‌వే ద్వారా 2,30,283 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలాగే 10 యూనిట్లలో విద్యుదుత్పత్తి కోసం 19,668 క్యూసెక్కులు, భీమా, నెట్టంపాడు, కుడి, ఎడమ కాల్వలకు  కలిపి మొత్తం 2,53,290 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)