Breaking News

నక్సలైట్‌గా మారేందుకు అవకాశం ఇవ్వండి

Published on Sun, 09/28/2025 - 13:22

సిరిసిల్లక్రైం: అధికారుల తీరుతో పదేళ్లుగా తనకు అన్యాయం జరుగుతోందని, తనలాంటి బాధితులకు న్యాయం చేసేలా నక్సలైట్‌గా మారేందుకు తనకు అవకాశం ఇవ్వాలని మిడ్‌మానేరు ప్రాజెక్టు నిర్వాసితుడు చల్లా బాలరాజు కోరారు. ఈమేరకు శనివారం రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్‌ బీ గీతేకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా బాధితుడు బాలరాజు మాట్లాడుతూ రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో నిర్మించిన మిడ్‌మానేరు ప్రాజెక్టులో స్థలం కోల్పోయానని తెలిపాడు. 

అధికారులు తనకు పదేళ్లుగా నష్టపరిహారం చెల్లించకుండా దరఖాస్తులు, పరిశీలన అంటూ కాలయాపన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతోపాటు మిగతా వారికి నష్టపరిహారం, ఇంటి స్థలాలు మంజూరు చేయాలని కోరారు. తమకు న్యాయం చేయాలని ఇప్పటికే కలెక్టర్, ఆర్డీవో కార్యాలయాల్లో దరఖాస్తులు అందజేసినా.. ఎవరూ పట్టించుకోలేదన్నారు.

 ఇప్పటి వరకు కలెక్టర్‌గా పనిచేసిన సందీప్‌కుమార్‌ ఝా నిర్వాసితుల సమస్యలపై అవహేళన చేస్తూ ఇబ్బందులకు గురిచేశారన్నారు. కలెక్టర్, ఉన్నతస్థాయి అధికారులపై కేసు నమోదు తమ పరిధిలో లేదని ఎస్పీ తెలిపినట్లు చెప్పారు. జిల్లాకు కొత్తగా రానున్న కలెక్టర్‌ రెవెన్యూ విభాగంలోని చట్టపరిధిలో చర్యలు తీసుకుంటారని ఎస్పీ సూచించారని తెలిపారు. ఎస్పీని కలిసిన వారిలో ఇనుకొండ లక్ష్మి, మంజుల, తిరుపతి, ఉపేందర్‌ ఉన్నారు.   

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)