వావివరసలు మరిచి చెల్లెపై కన్నేసి...

Published on Thu, 03/05/2026 - 00:54

ధర్మపురి: వావివరుసలు మరిచి ఓ యువకుడు వరసకు చెల్లె అయిన బాలికపైనే కన్నేశాడు. ప్రేమ పేరిట వేధించి..శారీరకంగా లొంగదీసుకున్నాడు. విషయం ఎవరికైనా చెబితే బాలికతోపాటు ఆమె సోదరుడిని చంపేస్తానని బెదిరించాడు. మనస్తాపానికి గురైన ఆ బాలిక గత డిసెంబర్‌ 8న క్రిమిసంహారక మందు తాగింది. అప్పటినుంచి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. ఈ సంఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నర్సయ్యపల్లిలో విషాదం నింపింది. 

పోలీసుల కథనం ప్రకారం.. నర్సయ్యపల్లెకి చెందిన దంపతులకు కూతురు, కుమారుడు సంతానం. తండ్రి బతుకుదెరువు కోసం దుబాయ్‌ వెళ్లాడు. పిల్లలను చదివిస్తూ తల్లి ఇంటివద్దనే ఉంటోంది. కూతురు జగిత్యాలలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ ఇంటర్‌ చదువుతోంది. వరసకు సోదరుడైన కోల మహేశ్‌  బాలికపై కన్నేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరంగా లొంగదీసుకున్నాడు. 

పెళ్లి చేసుకుందామని బాలిక కోరగా.. నిరాకరించిన మహేశ్‌ ‘చస్తే చావు..’అని చెప్పడంతో మనస్తాపానికి గురైన బాలిక పురుగులమందు తాగింది. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌ తరలించారు. విషయం తెలిసిన తండ్రి నెల క్రితం దుబాయ్‌ నుంచి స్వగ్రామానికి చేరుకున్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక మంగళవారం రాత్రి మృతి చెందింది. బాలిక మరణానికి కారణమైన మహేశ్‌పై మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో, రేప్‌ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. 

#

Tags : 1

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)