Breaking News

KBR Park Flyovers: స్పీడ్‌ పెరిగింది..

Published on Tue, 10/08/2024 - 07:58

బంజారాహిల్స్‌: ట్రాఫిక్‌ కష్టాలు లేకుండా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ మీదుగా హైటెక్‌సిటీ, గచ్చిబౌలి వైపు రయ్‌ రయ్‌మంటూ వాహనాలు దూసుకెళ్లేందుకే ప్రభుత్వం ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు నిరి్మంచేందుకు పచ్చజెండా ఊపిని విషయం విదితమే. ఇప్పటికే ఎక్కడెక్కడ అండర్‌పాస్‌ స్టార్ట్‌ అవుతుంది. 

ఎక్కడి నుంచి ఫ్లై ఓవర్‌ నిర్మిస్తున్నారు అనే విషయాలపై ప్రాజెక్టŠస్‌ అధికారులు భారీ మ్యాప్‌లు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. ఆ మ్యాప్‌ల ఆధారంగా ఇప్పుడు జలమండలి, అర్బన్‌ బయో డైవర్సిటీ, జీహెచ్‌ఎంసీ అధికారులు సర్వేలు చేస్తున్నారు. జలమండలి, యూబీడీ అధికారులు సర్వే పూర్తయిన తర్వాత పనులు ఎప్పుడు మొదలవుతాయనే విషయంలో ఓ క్లారిటీ రానుంది. ఇక్కడ ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్‌ కష్టాలకు పుల్‌స్టాప్‌ పెట్టినట్లు అవుతుంది.  

ఆరు జంక్షన్లలో పైప్‌లైన్లపై...  
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కేబీఆర్‌ పార్కు, జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.45 మీదుగా సాగే ఈ అండర్‌పాస్‌లు, ఫ్లై ఓవర్లు  నిరి్మంచే ప్రాంతాల్లో ఇప్పటికే భారీ మంచినీటి పైప్‌లైన్లతో పాటు మరికొన్ని చోట్ల సీవరేజి లైన్లు ఉన్నాయి. కేబీఆర్‌ పార్కు చుట్టూ వచ్చే ఆరు జంక్షన్లలో ఎక్కడెక్కడ ఏఏ లైన్లు ఉన్నాయో వాటిని సర్వే చేసే పనిలో జలమండలి జీఎం హరి శంకర్‌ ఆయా సెక్షన్ల మేనేజర్లు, ఇంజనీర్లతో సమీక్షిస్తున్నారు. ఈ జంక్షన్ల ప్రాంతంలో 1200, 1000, 900 ఎంఎం ఎంఎస్‌ వ్యాసార్థంలో భారీ మంచినీటి పైప్‌లైన్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిని ఆయా జంక్షన్ల నుంచి పక్కకు తప్పించేందుకు తగు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 

దీనికి తోడు వెంకటగిరి నుంచి తట్టికాన వాటర్‌ సెక్షన్‌కు నీళ్లు పంపింగ్‌ చేసే భారీ పైప్‌లైన్‌ వ్యవస్థ కూడా ఇక్కడ ఉంది. మ్యాప్‌ల ఆధారంగా ఇక్కడున్న మంచినీటి భారీ లైన్లు ఏ విధంగా ఎటు వైపు మారిస్తే బాగుంటుంది అనే అంశంపై ఇప్పటికే అధికారులు పలుమార్లు క్షేత్ర స్థాయిలో సైతం పర్యటించి నివేదికలను ఉన్నతాధికారులకు అందించారు. ఉన్నతాధికారుల నుంచి గ్రీన్‌సిగ్నల్‌ వస్తే పనులు మొదలు పెట్టే అవకాశం ఉంది.  

 

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)