Breaking News

‘ధాన్యం విక్రయ టెండర్లలో రూ.750 కోట్ల గోల్‌మాల్‌’

Published on Wed, 07/31/2024 - 05:13

సాక్షి, హైదరాబాద్‌: గోడౌన్‌లు, రైస్‌మిల్లులలో ధాన్యాన్ని ఖాళీ చేసేందుకు, విక్రయించేందుకు పిలిచిన టెండర్ల కేటా యింపులో రూ.750 కోట్ల మేర గోల్‌మాల్‌ జరిగిందని మాజీ మంత్రి, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ఆరోపించారు. మంగళవారం రాత్రి అసెంబ్లీలో పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...35 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని వేలం వేస్తే, నాలుగు సంస్థలే అర్హత సాధించాయని, ఆ సంస్థలేవో ఇప్పటివరకు బహిర్గతం చేయలేదన్నారు.

టెండర్లు దక్కించుకున్న ఆ నాలుగు సంస్థలు ఇప్పటివరకూ 35 కిలోల ధాన్యాన్ని కూడా సేకరించలేదని, 9 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి బదులుగా మిల్లర్ల నుంచి ఒక్కో క్వింటాలుకు రూ. 2,223 వసూలు చేశారని గంగుల ధ్వజమెత్తారు. ధాన్యానికి బదులు డబ్బులు వసూలు చేస్తే మిల్లుల్లో, గోడౌన్‌లలో ఉన్న ధాన్యం ఎలా ఖాళీ అవుతుందని ప్రశ్నించారు.

అలాగే గురుకులాలు, మధ్యాహ్న భోజనం కోసం పాఠశాలల్లో ఇచ్చే సన్న బియ్యంకు అవసరమైన 1.59 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని తక్కువ ధరకు విక్రయించి, అవే సంస్థల నుంచి కిలో బియ్యాన్ని రూ.57కు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఇందులో కూడా కుంభకోణం ఉందని, ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)