Breaking News

పండుగకు చుక్క, ముక్క లేనట్లే.!

Published on Sat, 09/27/2025 - 12:16

దసరా పండుగంటే అందరికి సంబరమే. అయితే ఈ సంవత్సరం అక్టోబర్‌ 2వ తేదీన వస్తుంది. దీంతో మద్యం, మాంసాహార ప్రియులు ఆలోచనలో పడ్డారు. తెలంగాణలో వివిధ శుభకార్యాలు, పండుగలు, ఫంక్షన్లు ఏదైనా.. మాంసం, మద్యం లేనిదే కిక్కు ఉండదు. ముఖ్యంగా రాష్ట్రంలో ఇది ఓ ఆనవాయితీగా వస్తోంది. ఇక దసరా అంటేనే  ఏ పండుగకి లేనంత జోష్‌ ఉంటుంది. ఇదే రోజు చుక్క, ముక్క ఉండాల్సిందే. మద్యంతో పాటు మటన్, చికెన్‌ కావాల్సిందే.

జోగిపేట(అందోల్‌): అక్టోబర్‌ 2న గాంధీ జయంతి, అదే రోజు దసరా పండుగ కూడా వస్తోంది. ఈ నేపథ్యంలో మద్యం, మాంసం విక్రయాలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. సాధారణంగా గాంధీ జయంతి రోజు మద్యం, మాంసం దుకాణాలు మూసి వేయడం ఆనవాయితీ. అయితే అన్ని పండుగల మాదిరిగా దసరా ఉండదు. ఆ రోజున చాలామందికి చుక్క లేనిదే ముద్ద దిగదు. అందుకోసం  పండుగ రోజు ఎట్లా అని మద్యం, మాంసం విక్రయాలపై తర్జన భర్జన పడుతున్నారు.

విక్రయాలపై సందిగ్ధం..
దసరాకి మాంసాహారులైన ప్రతి ఇంట్లో ముక్క ఉండాల్సిందే. పండుగ వేళ గొర్రె పొట్టేళ్లు, మేక పోతుల మంసానికి డిమాండ్‌ ఉంటుంది. నాటు, పారం కోళ్లు, చేపలకు కూడా మస్తు గిరాకీ ఉంటుంది.

ప్రతి రోజు కోట్లలో.. 
ఉమ్మడి జిల్లాలో ప్రతిరోజు రూ.10 కోట్ల వరకు, నెలకు సుమారుగా రూ.275 కోట్ల వరకు లిక్కర్‌ అమ్మకాలు జరుగుతాయి. అయితే ఒక్క దసరా రోజే ప్రతి యేట సుమారు రూ.20 కోట్లకు పైగా అమ్మకాలు జరిగి భారీగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. అయితే ఈ సారి దసరా, గాంధీ జయంతి ఒకే రోజు రావడం, మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు ఎక్సైజ్‌ అధికారులు ప్రకటించారు. దీంతో మద్యం అమ్మకాలపై, రాష్ట్ర ఖజానాపై ప్రభావం పడే అవకాశం లేకపోలేదు.

మటన్‌షాపులకు అనుమతివ్వండి 
ప్రతి సంవత్సరం దసరా రోజు మటన్, చికెన్‌ షాపుల్లో గిరాకీ ’ఉంటుంది. పండుగ రోజు విక్రయాలు జరగకపోతే ఆర్థికంగా నష్టపోతాం. అధికారులు స్పందించి అనుమతులివ్వాలి. పండుగ రోజు వందలాది మంది మార్కెట్‌కు మాంసం కోసం వస్తుంటారు.
 – శేఖర్, మాంసం వ్యాపారి

మద్యం విక్రయాలు జరగవు 
దసరా, గాంధీ జయంతి ఒకేసారి రావడంతో వైన్స్, బార్‌ షాపులు ప్రభుత్వ ఆదేశాల మేరకు బంద్‌ ఉంటాయి. బెల్ట్‌ షాపుల నిర్వాహకులు విక్రయాలు జరిపితే చర్యలు తీసుకుంటాం. ఎక్సైజ్‌ సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి మద్యం అమ్మకాలు జరగకుండా చూడాలి.   
– హరికిషన్, ప్రొహిబిషన్, ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్‌ 

Videos

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)