Breaking News

స్నేహమే నన్ను ఈ స్థాయిలో నిలిపింది

Published on Sun, 08/04/2024 - 04:47

సాక్షి, హైదరాబాద్‌: మంచి స్నేహితుల సాన్నిహిత్యం దొరికితే జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఛేదించవచ్చని.. జీవితాన్ని ఉత్తమంగా ఆస్వాదించవచ్చని చెప్పారు డీజీపీ జితేందర్‌. తాను ఈ స్థాయికి ఎదగడంలో తన స్నేహితుల సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగపడ్డాయని గుర్తు చేసుకున్నారాయన. 36 ఏళ్ల తమ స్నేహ జీవితంలో ఎన్నో సందర్భాలు చూశామని, ఆ మధురస్మృతులను స్నేహితుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’తో పంచుకున్నారు డీజీపీ జితేందర్‌... 

ఆ విషయాలు ఆయన మాటల్లోనే... 
‘‘నాకు బెస్ట్‌ ఫ్రెండ్స్‌ ఇద్దరు. ఒకరు ప్రస్తుతం జార్ఖండ్‌లో ఐఏఎస్‌గా పనిచేస్తున్న డా.ఏపీ సింగ్, మరొకరు కేంద్ర ప్రభుత్వ సైంటిస్ట్‌గా పనిచేస్తున్న డా.రాజీవ్‌ వర్‌‡్షనై. మేం ముగ్గురం ఢిల్లీ జేఎన్‌యూలో స్కూల్‌ లైఫ్‌ సైన్స్‌లో ఎంఫిల్‌ చేశాం. ఐదేళ్లపాటు ఒకే దగ్గర కలిసి ఉన్నాం.. మా జీవితాలను మలుపు తిప్పింది ఆ ఐదేళ్లే. యూపీఎస్సీకి బీజం పడింది అక్కడే.. నేను ఈ రోజు డీజీపీగా ఉన్నానంటే అందుకు ఆ స్నేహమే కారణం. నేను ఐపీఎస్, ఏపీ సింగ్‌ ఐఏఎస్, రాజీవ్‌ సైంటిస్ట్‌లుగా కెరీర్‌ మలచుకున్నాం. 

36 ఏళ్లుగా మా స్నేహం కొనసాగుతూనే ఉంది.. నా ప్రతి కష్టంలో, సంతోషంలో ప్రాణ మిత్రులిద్దరూ నాతో ఉన్నారు.  మేం ఎప్పుడు కలిసినా కుటుంబాలతో సహా కలుస్తాం. ప్రతి రెండు, మూడేళ్లకు ఒకసారి తప్పకుండా మా ఫ్యామిలీస్‌ గెట్‌ టు గెదర్‌ ఉంటుంది. స్నేహం గురించి చెప్పాలంటే ఏదో ఆశించి చేసే స్నేహం ఎప్పటికీ నిలవదు. ఫ్రెండ్‌షిప్‌ అనేది ఒక ఎమోషనల్‌ ఫీలింగ్‌..ఒక సెక్యూరిటీ..మంచి స్నేహితులున్న వారు జీవితంలో ఉన్నతంగా ఉంటారు. 

ఉత్తమ జీవితం గడుపుతారు. అందుకు నేను ఉదాహరణ. ప్రతి ఒక్కరి జీవితంలో బెస్ట్‌ ఫ్రెండ్‌ చాలా ముఖ్యం. మంచి స్నేహితుడు ఉంటే ఏ ఒత్తిడీ మన దరి చేర దు. అందుకే యువతకు నేను చెప్పేది ఒక్కటే. మంచి స్నేహితులను సంపాదించుకోండి.. జీవితాన్ని ఫలవంతంగా..ఆనందంగా గడపండి’’అని డీజీపీ జితేందర్‌ తెలిపారు. 

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు